TGPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్

Good News for Group 1 Aspirants: గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. జీవో నంబరు 29ని రద్దుచేయాలని, గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుడు పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగడం, అనంతరం వారు కోర్టును ఆశ్రయించిన జరిగిన సంగతి తెలిసిందే.
కాగా, హైకోర్టు వారి అభ్యర్థనను కొట్టివేయటంతో ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక పిటిషన్లపై తెలంగాణ ప్రభుత్వం వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు .. అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేయటంతో త్వరలో గ్రూప్ -1 ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ రంగం సిద్ధం చేస్తోంది.