Last Updated:

Pawan Kalyan : వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి.. బయటపెట్టిన పవన్

Pawan Kalyan : వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి.. బయటపెట్టిన పవన్

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతికి సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయ్యిందని సభ్యులు అన్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉపాధి హామీ పథకంపై దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినట్లు పేర్కొన్నారు.

 

 

ఈ క్రమంలోనే సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పవన్ చెప్పారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించి తప్పించినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి ప్లైయింగ్ స్వ్కాడ్‌లతో మాస్టర్ జాబితాలు సరిగా ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నామన్నారు. రూ.250 కోట్ల అవినీతి ఉపాధి హామీ పథకంలో జరిగిందని తెలిపారు. సాక్షాధారాలు లేక రూ.74 కోట్లు మాత్రమే రికవరీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 75 లక్షలు రికవరీ చేశామని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 31 మందిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్లు వేజెస్ పెంచడం అనేది కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.

 

 

సభ్యులు అడిగిన ప్రశ్నలు..
గత ఐదేళ్లగా ఎన్ఆర్ఈజీఎస్‌ను వైసీపీ ప్రభుత్వం ఆదాయ మార్గంగా మార్చుకుందని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులు మళ్లీ మళ్లీ చూపించి, కూలీలుగా రాని వారిని కూలీలుగా చూపించి డబ్బులు మింగేశారని ఆరోపించారు. ఆదోనిలో ఓ విలేకరి బంధువుల పేర్లు మాస్టర్‌లో రాసి పనికి రాకున్నా బిల్లు చెల్లించారని తెలిపారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇతర పార్టీల వారికి మాస్టర్ ఇవ్వమని చెప్పారన్నారు. రాజకీయ ఉపాధి హమీ పథకమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పథకం కాదు అనేలా మార్చేశారన్నారు. 70 రోజులుగా కూలీలకు ఎందుకు డబ్బులు పడడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి వివరాలు తమ కార్యాలయానికి పంపాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనిసరావు అన్నారు. వీరిపై చర్యలకు ఆదేశించాలని కోరుతున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: