Published On:

Pastor Praveen Pagadala Case: “రోడ్డు ప్రమాదంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతిచెందారు”: పాస్టర్ మృతిపై ఐజీ!

Pastor Praveen Pagadala Case: “రోడ్డు ప్రమాదంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతిచెందారు”: పాస్టర్ మృతిపై ఐజీ!

IG press meet on Pastor Praveen Pagadala Case: పాస్టర్ ప్రవీణ్ పగిడాల మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. కేసుకు సంబంధించి ఇవాళ రాజమండ్రిలో వివరాలు వెల్లడించారు. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారని తెలిపారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని, సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలూ ఇవ్వలేదన్నారు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలే అని స్పష్టం చేశారు. ప్రవీణ్ హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం దుకాణాలకు వెళ్లినట్లు గుర్తించామన్నారు. దారిలో ఆయనకు మూడు సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందన్నారు.

 

దారిలో 6సార్లు యూపీఐ పేమెంట్లు..
పాస్టర్ ప్రవీణ్ దారిలో 6సార్లు యూపీఐ పేమెంట్లు చేసినట్లు గుర్తించామన్నారు. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో తేలిందన్నారు. కీసర టోల్‌ప్లాజా వద్ద ప్రవీణ్ అదుపుతప్పి కింద పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించామన్నారు. సాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లినట్లు చెప్పారు. రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పరిస్థితిని ఓ ఆటో డ్రైవర్ చూశారన్నారు. ట్రాఫిక్ ఎస్సై సూచనతో పార్కులో 2గంటలు నిద్రపోయారన్నారు. కండషన్ బాగోలేదని, ఎంతచెప్పినా వివలేదన్నారు. హెడ్‌లైట్ పగిలిపోడంతో రైట్‌సైడ్ బ్లింకర్ వేసుకునే ప్రయాణించారని తెలిపారు.

 

ఏలూరులో మద్యం కొనుగోలు..
ఏలూరులో ప్రవీణ్ మద్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మద్యం దుకాణానికి వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్లజోడు పగిలిపోయి ఉందన్నారు. కొంతమూరు పైవంతెనపై కూడా ఆన వేగంగా వెళ్లినట్లు సీసీలో కనిపించాయన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయిందన్నారు. ఆయన బుల్లెట్‌ను ఏ వాహనం కూడా ఢీకొనలేదని వెల్లడించారు. బైక్‌కు, పక్కన వెళ్తున్న కారుకు చాలా గ్యాప్ ఉందని చెప్పారు. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయని, కంకర రాళ్లు ఉన్నాయని తెలిపారు. బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్‌పై పడిందని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బండి ఫోర్త్ గేర్‌లో ఉందన్నారు. ఇతర వాహనాలను ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని ఐజీ తెలిపారు.

ఇవి కూడా చదవండి: