Last Updated:

UN report: ఏడాదిలో స్వదేశానికి 87 బిలియన్ డాలర్లు పంపిన ప్రవాస భారతీయులు

భారత్‌లో డాలర్ల వర్షం కురుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు మాతృ దేశానికి ఏకంగా 87 బిలియన్‌ డాలర్లను పంపించారు. భారత్‌ తర్వాత స్థానంలో చైనా, మెక్సికోలున్నట్లు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ బుధవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

UN report: ఏడాదిలో స్వదేశానికి 87 బిలియన్ డాలర్లు పంపిన ప్రవాస భారతీయులు

UN report: భారత్‌లో డాలర్ల వర్షం కురుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు మాతృ దేశానికి ఏకంగా 87 బిలియన్‌ డాలర్లను పంపించారు. భారత్‌ తర్వాత స్థానంలో చైనా, మెక్సికోలున్నట్లు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ బుధవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. డబ్ల్యుహెచ్‌వో విడుదల చేసిన తాజా నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు శరణార్థిగా ఉన్నారని వీరంతా కలిసి సుమారు వంద కోట్ల వరకు ఉంటారని తెలిపింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ హెల్త్‌కు సంబంధించి విడుదల చేసిన నివేదికలో 2021లో ప్రపంచంలోని టాప్‌ ఐదు దేశాల్లో ఎక్కువ మొత్తంలో రెమిటెన్స్‌ పొందిన దేశాల విషయానికి వస్తే డాలర్ల ప్రాతిపదిక చూస్తే ఇండియా, చైనా, మెక్సికో, పిలిప్పీన్స్‌, ఈజిప్టులున్నాయి. 87 బిలియన్‌ డాలర్లతో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా, చైనా, మెక్సికోలు 53 బిలియన్‌ డాలర్లు, పిలిప్పీన్స్‌ 36 బిలియన్‌ డాలర్లు, ఈజిప్టు 33 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌ పొందాయి.

ఇక రెమిటెన్స్‌ విషయానికి వస్తే 2020లో అమెరికా నుంచి పెద్ద మొత్తంలో రెమిటెన్స్‌ రాగా, అటు తర్వాతి స్థానం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌ల నుంచి మాతృదేశానికి పెద్ద మొత్తంలో డాలర్లు వచ్చి చేరాయి. కోవిడ్‌ -19 సమయంలో రెమిటెన్స్‌ కాస్తా మందిగించింది. అయితే ఈ ఏడాది తిరిగి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కోవిడ్‌-19 సంక్షోభం ప్రభావం రెమిటెన్స్‌ తగ్గితే తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని డబ్ల్యుహెచ్‌ఓ తాజా నివేదికలో వెల్లడించింది.

దేశంలోకి పెద్ద మొత్తంలో రెమిటెన్స్‌ రావడంతో విదేశాలకు వలస వెళ్లిన కార్మికుడి కుటుంబంతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా లబ్ధి చేకూరుతుంది. విదేశాలకు వలస వెళ్లిన కార్మికుడు అక్కడ ఉద్యోగంలో చేరి మాతృదేశానికి డబ్బు పంపుతుంటాడు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బు ఒక దేశం నుంచి మరోదేశానికి చేతులు మారుతుంటోంది. కోవిడ్‌-19 నిబంధలన వల్ల కొన్ని దేశాల్లో పర్యాటకులపై ఆంక్షలు విధించడంతో ఆర్థిక వ్యవస్థ కుంటుపడ్డాయి. అయితే ఇటీవల కాలంలో రెమిటెన్స్‌ క్రమంగా పుంజుకుంటోంది. గత ఏడాది ఆర్థిక వ్యవస్థ స్వల్పంగా పుంజుకోవడంతో 2020తో పోల్చుకుంటే కాస్తా నయంగా ఉంది. మొత్తానికి రెమిటెన్స్‌ 1.7 శాతం క్షీణించి 549 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా దాని ప్రభావం గ్లోబల్‌ రెమిటెన్స్‌పై కనిపించిందని డబ్ల్యుహెచ్‌ఓ నివేదికలో వివరించింది.

ప్రస్తుతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పోల్చుకుంటే రెమిటెన్స్‌ 50 శాతం వరకు పెరిగిపోయాయి. చైనా తప్పించి మిగిలిన దేశాల్లోకి పెద్ద ఎత్తున రెమిటెన్స్‌ పెరిగాయి. దీంతో కోవిడ్‌ సంక్షోభం సమయంలో ఈ రెమిటెన్స్‌ డబ్బు ఆయా దేశాలకు బాగా కలిసొచ్చిందని నివేదికలో వెల్లడించింది. స్వల్ప ఆదాయం, మధ్య ఆదాయం కలిగిన దేశానికి చెందిన ప్రజలు తమ కుటుంబ పోషణ కోసం మాతృదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లి అక్కడ పనిచేసే మాతృదేశానికి రెమిటెన్స్‌ రూపంలో డాలర్లలో డబ్బు పంపిస్తుంటారు. ఈ డబ్బు వలస వెళ్లిన ఉద్యోగి కుటుంబంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: