Upasana Kamineni: ‘ఒకరు కన్నబిడ్డ అయితే.. మరొకరు దత్త పుత్రిక’.. ఉపాసన స్పెషల్ పోస్ట్
మెగా కోడలిగా, టాలీవుడ్ రామ్ చరణ్ భార్యగా, మెగా కోడలిగా మాత్రమే కాకుండా ఉపాసన కొణిదెల సామాజిక సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Upasana Kamineni: మెగా కోడలిగా, టాలీవుడ్ రామ్ చరణ్ భార్యగా, మెగా కోడలిగా మాత్రమే కాకుండా ఉపాసన కొణిదెల సామాజిక సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వ్యక్తి గత విషయాలతో పాటు వివిధ అంశాలను వివిధ అంశాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.
అందుకోసమే స్టార్స్ కు పోటీగా ఉపాసనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు.
సద్గురుతో కుమార్తెలు(Upasana Kamineni)
తాజాగా ఉపాసన యోగి, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉపాసన తాజా పోస్ట్.. దానికి ఇచ్చిన కాప్షన్ నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తోంది. సద్గురు.. ఆయన కుమార్తే రాధే జగ్గీతో దిగిన ఫొటోను షేర్ చేసిన ఉపాస ‘తన కుమార్తెలతో సద్గురు. ఒకరు కన్నబిడ్డ అయితే.. మరొకరు దత్త పుత్రిక’ అని ఉపాసన పేర్కొన్నారు.
Always a pleasure to be in the presence of @sadhguru
Thank you for coming for Thatha’s birthday
Big hug to @radhejaggipic.twitter.com/9LziijVQVv
— Upasana Konidela (@upasanakonidela) February 16, 2023
View this post on Instagram
సద్గురుకు ధన్యవాదాలు
ఇటీవల ఉపాసన తాతయ్య.. అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సద్గురు, ఆయన కుమార్తె రాధే వచ్చినట్టు ఉపాసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసన సద్గురు సమక్షంలో ఉండటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని.. తాతయ్య బర్త్ డే పార్టీకి వచ్చిన ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఉపాసన.