Last Updated:

Vijayashanti: రైతులను ఏడిపిస్తున్న తెరాస ప్రభుత్వం.. విజయశాంతి

అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీపై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Vijayashanti: రైతులను ఏడిపిస్తున్న తెరాస ప్రభుత్వం.. విజయశాంతి

Hyderabad: అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీ పై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చేను ఎంత ఏపుగా ఎదిగినా పూత, కాత రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారన్నారు. పెట్టుబడికి సరిపడ దిగుబడి కూడా పత్తి పంటకు రావడం లేదని, దీంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతన్నలు పడుతున్న ఇబ్బందులు కేసిఆర్ కు పట్టడం లేదని విమర్శించారు. పేరుకు మాత్రమే రైతు ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మహత్యలకు పాల్పొడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం కేసిఆర్ పై ఉందని విజయశాంతి అన్నారు. లేని పక్షంలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పక మానరని గుర్తుంచుకోవాలని ఆమె హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: KTR Road Show: కేటిఆర్ రోడ్ షో.. వాహనదారులకు ఇక్కట్లు

ఇవి కూడా చదవండి: