Last Updated:

Pakistan: ఇండియాతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలి.. పాక్ ప్రధాని షరీఫ్ కు వ్యాపావేత్తల సూచన

పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ దిన దిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నడుంబిగించారు. కరాచీలోని వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశానికి చెందిన అతి పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ముందుగా రాజకీయ సుస్థిరతకు ప్రయత్నించాలని సూచించారు వ్యాపారవేత్తలు.

Pakistan: ఇండియాతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలి.. పాక్ ప్రధాని షరీఫ్ కు వ్యాపావేత్తల సూచన

Pakistan: పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ దిన దిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నడుంబిగించారు. కరాచీలోని వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశానికి చెందిన అతి పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ముందుగా రాజకీయ సుస్థిరతకు ప్రయత్నించాలని సూచించారు వ్యాపారవేత్తలు.

ఈ సందర్బంగా షరీఫ్‌ వ్యాపారవేత్తలతో మాట్లాడుతూ ఒకప్పుడు ఈస్ట్‌ పాకిస్తాన్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌ మనకు భారం అనుకునే వారం.. ఇప్పుడు బంగ్లాదేశ్‌ కూడా పారిశ్రామికంగా అభివృద్ది చెందుతోంది. బంగ్లాదేశ్‌ గురించి చిన్నప్పుడు తాము వినేవారమని, పాకిస్తాన్‌ భజాలపై ఈస్ట్‌ పాకిస్తాన్‌ భారమని చెప్పేవారు… ఈ రోజు వారు ఎక్కడికి చేరుకున్నారు… మనం ఎక్కడ ఉన్నామో చూడండి అని షరీఫ్‌ వ్యాపారవేత్తలతో నిర్వేదంతో అన్నారు. ప్రస్తుతం వెనక్కి తిరిగి చూస్తే తనకే సిగ్గేస్తుందన్నారు పాక్‌ ప్రధానమంత్రి షరీఫ్‌.పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలహా ఇవ్వండి అని ఇక్కడి బిజినెస్‌ కమ్యూనిటిని అడిగారు షరీఫ్‌.దీనితో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే ముందుగా ఇండియాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకోవాలని…చర్చలు జరపాలని సూచించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడితే పాకిస్తాన్‌ ఆర్థికంగా మెరుగుపడుతుందన్నారు.

ఆర్టికల్ 370 రద్దుతో ..(Pakistan)

2019లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇండియాతో ఉన్న దౌత్యపరమైన సంబంధాలను తెగతెంపులు చేసుకుంది పాకిస్తాన్‌. మీరు కొందరితో హ్యాండ్‌ షేక్‌ చేసి మంచి ఫలితాలు సాధించారని ఐఎంఎఫ్‌ గురించి ప్రస్తావిస్తూ అన్నారు. అలాగే మరికొన్ని హ్యాండ్‌ షేక్‌లు ఇచ్చి ఇండియాతో వాణిజ్య సంబంధాలను మెరగుపర్చుకోవాలని కోరారు. ముఖ్యంగా ఇండియాతో మెరుగైన సంబంధాలు కుదర్చుకుంటే పాకిస్తాన్‌ లబ్ది పొందచ్చునని, అలాగే అడియాల జైల్లో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌తో ప్యాచ్‌ అప్‌ చేసుకోవాలని సూచించారు. చివరిగా షరీఫ్‌ వ్యాపారవేత్తలతో మాట్లాడుతూ వారి డిమాండ్‌ను ఆమోదిస్తామన్నారు. అదే సమయంలో ఎగుమతులపై ఫోకస్‌ పెడతామన్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలను ప్రవేటీకరణ చేస్తామని.. ఇవన్నీ పారదర్శకంగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల వల్ల వందలాది కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశంలోని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు జూనియర్‌ షరీఫ్‌.