Surat Lok Sabha Seat: బీజేపీ బోణీ కొట్టింది.. సూరత్ లోక్‌సభ సీటును ఏకగ్రీవంగా గెలుచుకున్న బీజేపీ
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఇంకా పూర్తికాకుండానే బీజేపీ బోణీ కోట్టేసింది. గుజరాత్ లోని సూరత్ లోక్‌సభ సీటును ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. పోటీలో మిగిలిన అభ్యర్దులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్ది ముఖేష్ దలాలీ ఏకగ్రీవంగా గెలుపొందారు.
Surat Lok Sabha Seat: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఇంకా పూర్తికాకుండానే బీజేపీ బోణీ కోట్టేసింది. గుజరాత్ లోని సూరత్ లోక్‌సభ సీటును ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. పోటీలో మిగిలిన అభ్యర్దులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్ది ముఖేష్ దలాలీ ఏకగ్రీవంగా గెలుపొందారు.
ఇండిపెండెంట్లు తప్పుకోవడంతో..(Surat Lok Sabha Seat)
సూరత్ లోక్‌సభ స్దానానికి కాంగ్రెస్ పార్టీ తరపున నీలేష్ కుంభానీ నామినేషన్ దాఖలు చేసారు. అయితే అతని నామినేషన్ ఫారమ్ పై ప్రతిపాదకుల సంతకాలపై బీజేపీ అభ్యర్ది ముఖేష్ దలాలీ ఎన్నికల ఏజెంట్ దినేష్ జోదానీ అభ్యంతరం వ్యక్తం చేసారు. దీనితో ప్రతిపాదకులు తాము సంతకాలు చేయలేదని ఎన్నికల అధికారికికి ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నారు. దీనితో రిటర్నింగ్ అధికారి కుంబానీ నామినేషన్ ను తిరస్కరించారు. మరోవైపు లాగ్ పార్టీకి చెందిన సోహీల్ షేక్, గ్లోబల్ రిపబ్లికన్ పార్టీకి చెందిన జయేష్‌బాహి మేవాడా, సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్టీకి చెందిన అబ్దుల్ హమీద్ ఖాన్. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్యారేలాల్ భారతి, స్వతంత్ర అభ్యర్దులు భారత్‌భాయ్ ప్రజాపతి, అజిత్‌సిన్హ్ భూపత్‌సిన్హ్ ఉమత్, కిషోర్‌భాయ్ దయానీ, బరయ్య రమేష్‌భాయ్ పర్సోత్తంభాయ్ తదితరులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీనితో పోటీలో ఎవరూ లేకుండా పోయారు. బీజేపీ అభ్యర్ది ముఖేష్ దలాలీ పోటీ లేకుండా ఎంపీగా ఎన్నికయ్యారు.
ఇలా ఉండగా పార్టీ గుజరాత్ యూనిట్ చీఫ్ సిఆర్ పాటిల్ తమ పార్టీ ఏకగ్రీవంగా సూరత్ సీటును గెలుచుకవోడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. ప్రధాని నరేంద్ర మోదీకి సూరత్ మొదటి కమలాన్ని అందించింది. సూరత్ లోక్‌సభ స్థానానికి మా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నేను అభినందిస్తున్నానని పాటిల్ సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు. గుజరాత్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 24 స్దానాల్లో, ఆప్ 2 స్దానాల్లో తమ అభ్యర్దులను నిలబెట్టాయి.