Kanguva: ‘కంగువా’ ఫస్టాఫ్‌పై విమర్శలు – కీలక నిర్ణయం తీసుకున్న మూవీ టీం!
Kanguva Movie Makers Key Decision: సూర్య నటించిన ‘కంగువా’ భారీ అంచనాల మధ్య నవంబర్ 14న థియేటర్లోకి వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం టీం రెండేళ్ల పాటు కష్టపడింది. మూవీ పోస్టర్స్, టీజర్,ట్రైలర్‌తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో సూర్య కంగువ అనే పోరాట యోధుడి పాత్ర అందరిలో ఆసక్తిని పెంచింది. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్‌ని కంగువా నిరాశ పరిచింది. దీంతో సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. తొలి అరగంట ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
సెకండాఫ్‌లో యాక్షన్ సీన్స్, సూర్య పర్ఫామెన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్న తొలి అరగంట ప్రభావం మూవీ మొత్తం మీద పడింది. నెగిటివ్ రివ్యూస్ రావడంతో అది కాస్తా కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. దాదాపు రూ. 350 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 160 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి కంగువా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ చిత్రం. సెకండాఫ్ చాలా బాగుంది.
కానీ మొదటి అరగంట ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. ఈ క్రమంలో సెకండాఫ్‌పై పెద్దగా దృష్టి పెట్టడలేకపోయారు రివ్యూయర్స్. దీంతో ఈ అరగంటలో నుంచి 12 నిమిషాల నిడివిని కత్తిరించాలని మూవీ టీం నిర్ణయం తీసుకుందట. మూడు గంటలు ఉన్న సినిమా ఇప్పుడు 2:22 నిమిషాలు నిడివికి తగ్గించి ఆడియన్స్‌కి కొత్త వెర్షన్ అందించాలని భావిస్తున్నారు. ఈ మేరకు టీం వర్క్ కూడా మొదలు పట్టినట్టు తెలుస్తోంది. ఇక సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్, సౌండ్ విషయంలోనూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సౌండ్ చాలా లౌడ్‌గా ఉందనే నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి.
దీంతో ఈ సినిమా సౌండ్‌ను కూడా తగ్గించాలని మేకర్స్ భావించారట. మూవీ టీం తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో రిలీజైన రెండు మూడు రోజుల్లోనే చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ఆడియన్స్ నుంచి వస్తున్న నెగిటివి రివ్యూస ఆధారంగా ఈ సినిమాను కత్తిరించారట. ఇందులో గోవా ఎపిసోడ్‌లోని చాలా సీన్లను కత్తిరించారు. ఈ ఎపిసోడ్‌లో చాలా సీన్స్ ఆడియన్స్‌కి బోరింగ్ అనిపించాయి. అవసరం లేకున్నా అన్ని పాత్రలు చూపిస్తూ ల్యాగ్ చేశారు. దీంతో అనవసరం అనిపించిన చాలా సీన్లను ఈ కట్టింగ్‌లో లేపేశారని తెలుస్తోంది. మరి కొత్త వెర్షన్ ఎలా ఉందో తెలియాలంటే మరోసారి థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే.