Last Updated:

Salman Khan: వరుస హత్య బెదిరింపులు – సల్మాన్‌ ఖాన్‌ ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ గ్లాస్‌

Salman Khan: వరుస హత్య బెదిరింపులు – సల్మాన్‌ ఖాన్‌ ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ గ్లాస్‌

Salman Khan House Covered with Bullet Proof Glass: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తన భద్రతపై మరింత ఫోకస్‌ పెట్టారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న క్రమంలో తన ఇంటికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కృష్ణ జింకను వెటాడి చంపిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి సల్మాన్‌కు హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఈ బెదిరింపు మరింత ఎక్కువ అయ్యాయి. అంతేకాదు పలుమార్లు సల్మాన్‌ ఇంటిపై అతడి బృందం సభ్యులు తుపాకితో కాల్పులకు తెగబడ్డారు.

ఆయనను చంపేస్తామంటూ తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తన భద్రత కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు కొన్న సల్మాన్‌ తాజాగా తన ఇంటికి ఏకంగా బుల్లెట్‌ ఫ్రూఫ్‌ గ్లాస్‌ను అమర్చారు. ముంబైలో తన గెలాక్సి అపార్టుకు మొత్తాన్ని బుల్లెట్‌ ఫ్రూఫ్‌ గ్లాస్‌తో కప్పించారు. ఇంటి బాల్కనీకి బుల్లెట్‌ఫ్రూఫ్‌ గ్లాస్‌ అమరుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇప్పటికే రూ. 2 కోట్లు విలువైన బుల్లెట్‌ఫ్రూఫ్‌ కారుని సల్మాన్‌ దుబాయ్‌ నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఇక కేంద్ర ప్రభుత్వం సల్మాన్‌కు ‘వై’ కేటగిరి భద్రతను కెటాయించింది.

1998 కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌ చేసింది. బిష్ణోయ్‌ కమ్మునిటీ కృష్ణ జింకను దైవంగా కోలుస్తారు. దీంతో తాము దైవంగా కొలిచే జింకను చంపడంపై బిష్ణోయ్‌ కమ్మునిటీ సల్మాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సల్మాన్‌ స్వయంగా వచ్చిన క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోటారు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్‌ ఇంటి ముందు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే జూన్‌లో మరోసారి సల్మాన్‌ హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్‌ ఫామ్‌హౌస్‌ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్‌పై దాడి చేయాలని ఈ గ్యాంగ్‌ ప్లాన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి: