Last Updated:

Pushpa 2: పుష్ప 2 రీ లోడెడ్‌ వెర్షన్‌ – అదనంగా 20 నిమిషాలు, థియేటర్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..

Pushpa 2: పుష్ప 2 రీ లోడెడ్‌ వెర్షన్‌ – అదనంగా 20 నిమిషాలు, థియేటర్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..

Pushpa 2 Reloaded Version Loading: పుష్ప 2 మూవీ రీలోడ్‌ అవుతుంది. ఈ సంక్రాంతికి రీ లోడ్‌ వెర్షన్‌తో థియేటర్లో సందడి చేయబోతోంది. విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 మూవీ ఎన్నో రికార్డులు బ్రేక్‌ చేసింది. బాక్సాఫీసు వద్ద వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. అతి తక్కువ టైంలోనే రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ చేసింది. కేజీయఫ్‌ 2, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రికార్డ్స్‌ చకచక బ్రేక్‌ చేసిన ఈ సినిమా రీసెంట్‌ బాహుబలి 2 రికార్డును బీట్‌ చేసింది. నెల రోజుల్లో రూ. 1831 కోట్ల వసూళ్లు చేసి బాహుబలి 2 ఆల్‌టైం రికార్డును బ్రేక్‌ చేసింది.

సినిమా విడుదలై నెల రోజులు దాటిన ఇప్పటికీ పుష్ప 2 థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌ రన్‌ అవుతుంది. ఇప్పటికే కొన్ని థియేటర్లో పుష్ప 2 హౌజ్‌ ఫుల్‌ అవుతుంది. దీంతో ఆడియన్స్‌ మరింత ఆకట్టుకునేందుకు మూవీ టీం సరికొత్త అప్‌డేట్‌తో వచ్చింది. ప్రేక్షకులకు బోర్‌ కొట్టించకుండ పుష్ప 2కి అదనంగా 20 నిమిషాలు జోడించారు. అదిరిపోయే యాక్షన్‌, ఎమోషన్‌ సీన్స్‌తో మూవీ నిడివిని మరో 20 నిమిషాలు పెంచారు. ఈ రీలోడెడ్‌ వెర్షన్‌ సంక్రాంతి నుంచి అందుబాటులోకి రానుంది.

జనవరి 11 నుంచి ఈ 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ని జోడించి థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. పుష్ప 2 ది రూల్‌ రీ లోడెడ్‌ వెర్షన్‌ 20 నిమిషాల అదనంగా రానుందంటూ సరికొత్త పోస్టర్‌తో మేకర్స్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో పుష్పరాజ్‌ ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. సాధారణంగా ఓ సినిమా నిడివి రెండన్నర గంటలు లేదు 2 గంటల 45 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ పుష్ప 2 చిత్రం ఇప్పటికే 3 గంటల 15 నిమిషాల నిడివి ఉంది. ఇంత సేపు ప్రేక్షకులను బోర్‌ కొట్టించకుండ చూపించడమంటే సాధారణ విషయం కాదు. రిలీజ్‌కు ముందు ఈ చిత్రానికి వీపరీతమైన బజ్‌ నెలకొంది. దాందో పుష్ప 2 మూవీ నిడివి ఎక్కువైన పర్లేదు అంటున్నారు. ఇక ప్రేక్షకులు ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో కట్‌ సీన్స్‌ జోడించి మరో 20 నిమిషాల నిడివి పెంచబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్‌ తాజాగా ప్రకటన ఇచ్చారు.