Last Updated:

Samsung Galaxy S23 FE: తప్పుకోండి అంత.. సామ్‌సంగ్ రూ. 84వేల ఫోన్ ఇప్పుడు రూ.37 వేలకే.. ఇంకా బోలెడు ఆఫర్లు ఉన్నాయ్..!

Samsung Galaxy S23 FE: తప్పుకోండి అంత.. సామ్‌సంగ్ రూ. 84వేల ఫోన్ ఇప్పుడు రూ.37 వేలకే.. ఇంకా బోలెడు ఆఫర్లు ఉన్నాయ్..!

Samsung Galaxy S23 FE: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ప్రస్తుతం అతిపెద్ద ఆఫర్ Samsung Galaxy S23 FE సిరీస్‌లో ఉంది. ఈ మొబైల్‌పై 55 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీని అసలు ధర రూ.  84,999. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రూ.23,650 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. మీరు కూడా ఈ ఫోన్‌ని కొనాలంటే.. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ S23 FE ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్. దీనిలో మీరు డిస్‌ప్లే నుండి ప్రాసెసర్, కెమెరా వరకు శక్తివంతమైన ఫీచర్‌లను చూడవచ్చు. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం, ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మీరు ఇప్పుడు Samsung Galaxy S23 FE 256GB వేరియంట్‌ని దాని అసలు ధరలో సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S23 FE Offers
సామ్‌సంగ్ గెలాక్సీ S23 FE 256GB ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 84,999గా ఉంది. 2025 రాగానే దానిపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్ కూడా వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ తన ధరను భారీగా 55 శాతం తగ్గించింది. ఈ ఆఫర్‌తో మీరు ఇప్పుడు కేవలం రూ.37,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ. 47000 పొదుపుతో మీరు దీన్ని కొనుగోలు చేయగలుగుతారు. ఈ ధరల శ్రేణిలో ఇది గొప్ప స్మార్ట్‌ఫోన్, దీనిలో మీరు సులభంగా మల్టీ టాస్కింగ్ చేయచ్చు.

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు డబ్బు ఆదా చేయడానికి కొన్ని ఇతర ఆఫర్‌లను కూడా ఇస్తుంది. మీరు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోళ్లపై ఈ ఫోన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది కాకుండా, మీరు దీన్ని EMIలో కూడా సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో మీరు దీనిపై మరింత ఆదా చేసుకోవచ్చు. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,650 వరకు మార్చుకోవచ్చు.

Samsung Galaxy S23 FE Specifications
ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ ప్యానెల్‌తో కూడిన అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది.
వాటర్, డస్ట్ నుండి ప్రొటక్ట్ చేయడానికి ఇది IP68 రేటింగ్‌ని కలిగి ఉంది.  దీనిలో కంపెనీ శక్తివంతమైన 6.4 అంగుళాల డిస్‌ప్లేను అందించింది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఇస్తుంది. దీని డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 13లో రన్ అవుతుంది, మీరు తర్వాత అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. సామ్‌సంగ్ గెలాక్సీ S23 FE 8జీవీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. దీనిలో 50+8+12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10MP ఫ్రంట్ కెమెరా ఉంది.