Last Updated:

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎంతో తెలుసా? – బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతంటే..

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎంతో తెలుసా? – బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతంటే..

Game Changer Pre Release Business: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ మరో మూడు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత చరణ్‌ సోలోగా వస్తున్న చిత్రమిది. దీంతో గేమ్‌ ఛేంజర్‌ కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. అలాగే మూవీ బడ్జెట్‌ ఎంతనేది కూడా ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. మరి గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు, బడ్జెట్‌ ఎలా ఎలా ఉందో చూద్దాం!

రామ్‌ చరణ్‌ హీరోగా బాలీవుడ్‌ బ్యూటీ కియార అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం స్లో స్లోగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఈ చిత్రంపై ప్రకటన వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కూడా విడుదలై రెండేళ్లు అయిపోయింది. ఎప్పుడో రిలీజ్‌ అవుతుందనుకున్న ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతు వచ్చింది. ఇక ఎట్టకేలకు 2025 సంక్రాంతి విడుదలకు సిద్ధమైంది.

ఇంకా రిలీజ్‌కు మూడు రోజులే ఉండటంతో గేమ్‌ ఛేంజర్‌ అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ చేసిందని తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 127 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిందని టాక్‌. కేవలం నైజాం ఏరియాలోనే రూ. 44 కోట్ల బిజినెస్ చేసిందని సినీ వర్గాల నుంచి సమాచారం. రామ్‌ చరణ్‌ సోలో హీరో సినిమాల్లో కెల్ల ఇది హయ్యెస్ట్‌ బిజినెస్ ఇదే అని సమాచారం.

ఇక సీడెడ్‌లో రూ. 24కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 15కోట్లు, గుంటూరులో రూ. 11 కోట్లు, ఈస్ట్‌ గోదావరి రూ. 10.5 కోట్లు, వెస్ట్‌ గోదావరి రూ. 9 కోట్లు, కృష్ణ రూ. 8.5 కోట్లు, నెల్లూరు రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సుమారు రూ. 450 కోట్లు పెట్టినట్టు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఇక గేమ్‌ ఛేంజర్ బ్రేక్‌ ఈవెన్‌ అవ్వాలంటే రూ. 800 కోట్లు చేయాల్సి ఉంది. మరి రిలీజ్‌ తర్వాత గేమ్‌ ఛేంజర్ మూవీ ఎలాంటి టాక్‌ తెచ్చుకుంటుంది.. ఏ రేంజ్‌లో వసూళ్లు చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: