Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన – శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
Allu Arjun Visit KIMS Hospital: సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను మంగళవారం పరామర్శించారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఇందుకోసం అల్లు అర్జున్ రాంగోల్‌పేట్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలీసుల అనుమతితో వెళ్లారు. అల్లు అర్జున్ ఆస్పత్రికి వెళుతున్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని, ఆయన వచ్చే టైం ఎవరికి చెప్పొద్దని పోలీసులు కండిషన్ పెట్టారు.
ఈ మేరకు కిమ్స్ హాస్పిటల్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సంధ్య థియేటర్ ఘటనలో కేసు నమోదైన నేపథ్యంలో అల్లు అర్జున్ పరామర్శకు వెళ్లొద్దని లీగల్ టీం చెప్పడంతో శ్రీతేజ్ వద్దకు రాలేదని ఇటీవల అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. తాజాగా పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఆయన శ్రీతేజ్‌ను కలిసేందుకు వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఉన్న అల్లు అర్జున్ వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బాలుడి తండ్రి భాస్కర్‌తో కూడా బన్నీ మాట్లాడారు. కాగా గత డిసెంబర్ 5న ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ సందర్భంగా ముందు రోజు రాత్రి భారీ స్థాయిలో బెనిపిట్ షోలు వేశారు. సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లడంతో ఆయనను చూసేందుకు అభిమానులంత ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోగా.. ఈ ఘటన రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గత నెల రోజులు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి అతడి ఆరోగ్య పరిస్థితి అంతంమాత్రంగానే ఉంది.