Sai Dharam Tej : అమ్మా ఈ సినిమా నీకోసమే అంటూ ఎమోషనల్ అయిన సాయి తేజ్
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కి గురై చాలా రోజులు హాస్పిటల్, ఇంట్లోనే ఉండి పూర్తిగా రికవర్ అయ్యాక ఇప్పుడు "విరూపాక్ష" సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేని
Sai Dharam Tej : మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కి గురై చాలా రోజులు హాస్పిటల్, ఇంట్లోనే ఉండి పూర్తిగా రికవర్ అయ్యాక ఇప్పుడు “విరూపాక్ష” సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేని అందిస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ లు, టీజర్ అండ్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈరోజు ఈ సినిమా నుంచి ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా.. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అమ్మ కోసమే ఈ సినిమా చేశానంటూ ఆయన ఎమోషనల్‌గా చెప్పి అమ్మపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు సాయి తేజ్. ‘‘మా టీమ్ ఎంతో ప్రేమించి, కష్టపడి చేసిన సినిమా. ఓ మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ నెల 21 థియేటర్స్‌లో అందరం కలుద్దాం. బ్లాక్ బస్టర్ న్యూస్‌తో మాట్లాడుకుందాం. అందరూ సపోర్ట్ చేయండి. అమ్మా ఈ సినిమా నీకోసం. ఐ లవ్ యు అమ్మ. నేను అడిగిన తర్వాత సపోర్ట్ చేయటానికి వచ్చిన నా తొలి సినిమా నిర్మాతలు దిల్ రాజు, అరవింద్ గారికి థాంక్స్’’ అన్నారు.
కాగా బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కోలుకోవటానికి చాలా సమయాన్నే తీసుకున్నారు. యాక్సిడెంట్ సమయంలో ఆయన షాక్ వల్ల మాటను కూడా కోల్పోయారు. అయితే చాలా కష్టపడి మళ్లీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.అదే విధంగా ఈ కార్యక్రమంలో సాయి పంచెకట్టుతో పాల్గొనటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ తొలి చిత్రం పిల్లా నువ్వులేని జీవితం సినిమాను రూపొందించిన నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో మళయాల ముద్దుగుమ్మ, సార్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీతో సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మరి ఈ ఈవెంట్ కి ఎవరు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.