Best Car For Middle Class: మిడిల్ క్లాస్ వారి కోసమే.. మహీంద్రా స్కార్పియో N.. ఆన్ రోడ్ ప్రైజ్, మైలేజ్ ఎంతంటే..?

Best Car For Middle Class: టయోటా ఫార్చ్యూనర్‌కు దానికంటూ పెద్ద మార్కెట్ ఉంది. ఈ కారు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలా బలంగా ఉంది. ప్రజలు ఈ కారు కొనాలని కలలు కంటారు, కానీ దాని ధర చూసి, ప్రజలు వెనక్కి తగ్గుతారు. టయోటా ఫార్చ్యూనర్ టాప్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 60 లక్షలు. దీని ధరను చాలా మంది భరించలేరు. అటువంటి పరిస్థితిలో మీ కోసం అలాంటి ఎస్‌యూవీని తీసుకువచ్చాము. దీని టాప్ వేరియంట్ ఫార్చ్యూనర్ టాప్ మోడల్ ధరలో దాదాపు సగం ధరకే లభిస్తుంది. ఈ కారు పేరు మహీంద్రా స్కార్పియో ఎన్, దీని ధర రూ.13.99 లక్షల నుండి రూ.24.69 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు టాప్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.30 లక్షలు.
Mahindra Scorpio N Engine
మహీంద్రా స్కార్పియో N రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇందులో 2.2-లీటర్ డీజిల్ యూనిట్ ఉంది. ఈ ఇంజిన్ 132 పిఎస్ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ లేదా 175 పిఎస్ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీలో 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 203 పిఎస్ పవర్, 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మహీంద్రా స్కార్పియో N రెండు ఇంజన్లు 6-స్పీడ్ MT (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) లేదా 6-స్పీడ్ AT (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్)తో ఉంటుంది. డీజిల్ ఇంజిన్ వేరియంట్ 4×4 డ్రైవ్ సెటప్ ఎంపికను కూడా ఆఫర్ చేస్తుంది. ఈ కారులో 6-7 మంది హాయిగా ప్రయాణించవచ్చు.
Mahindra Scorpio N Mileage
ఈ కారు లీటర్‌పై 12-16 KMPL వరకు మైలేజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. డీజిల్ MT వేరియంట్ లీటరుకు 16 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది, డీజిల్ AT వేరియంట్ లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
Mahindra Scorpio N Specifications
కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి అనేక కొత్త ఫీచర్లతో కూడిన ఆధునిక క్యాబిన్‌తో వస్తుంది.
Mahindra Scorpio N Safety Features
ఈ కారు గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించడంతో భద్రత పరంగా కూడా ముందంజలో ఉంది. దీనికి ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ముందు ,వెనుక కెమెరాలు, హిల్-అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మరిన్నో ఉన్నాయి.
Comparison with Fortuner
ఈ కారు పొడవు 4662 మిమీ, వెడల్పు 1917 మిమీ, ఎత్తు 1857 మిమీ, ఇది ఫార్చ్యూనర్‌కు సమానం. ఫార్చ్యూనర్ పొడవు 4795 మిమీ, వెడల్పు 1855 మిమీ, ఎత్తు 1835 మిమీ.