Published On:

Bobbili: బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మాణం

Bobbili: బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మాణం

vizianagaram: విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం ఛైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావుపై ఎట్టకేలకు అవిశ్వాస తీర్మానం ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షులు సావు వెంకట మురళీకృష్ణారావుపై అదే పార్టీకి చెందిన అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి తెర లేపడంతో కూటమి అవిశ్వాస తీర్మానం ప్రకటించింది. అవిశ్వాస తీర్మానం నోటీసును జిల్లా కలెక్టర్ అంబేద్కర్‌కు ఈ నెల 2న అందజేశారు. ఈ మేరకు బొబ్బిలి పురపాలక అధ్యక్షుడు సావు వెంకట మురళీకృష్ణారావుపై ఇవాళ అవిశ్వాసం ప్రవేశపెట్టనున్నారు.

 

పురపాలక సంఘానికి 31 మంది సభ్యులు ఎన్నిక కాగా.. 21వ వార్డు సభ్యుడు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఉన్న 30 మందిలో 10 మంది టీడీపీ కాగా.. మిగిలిన 20 మంది వైసీపీకి నుంచి గెలుపొందారు. వైసీపీకి చెందిన 20 మందిలో 10 మంది అసమ్మతి వర్గంలో చేరారు. వీరంతా చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావుకు వ్యతిరేకంగా ఓటింగ్‌కు సిద్ధమయ్యారు. దీంతో టీడీపీ సంఖ్యా బలం 20కి చేరింది.

 

ఎన్నికకు కోరం సరిపోవడంతో అధ్యక్ష పీఠంపై టీడీపీ మరింత పట్టుబిగించింది. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇవాళ నేరుగా కౌన్సిల్ మందిరానికి చేరుకోనున్నారు. మరోవైపు అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదీలా ఉండగా బొబ్బిలి పురపాలక వైసీపీ కౌన్సిలర్లకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విప్ జారీ చేశారు. వైసీపీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు ఇతర పార్టీకి మద్దతు పలికితే వారి సభ్యత్వం రద్దవుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి: