Last Updated:

Sreeleela: ‘పుష్ప 2’ కిస్సిక్‌ సాంగ్‌లో శ్రీలీల ఫిక్స్‌ – పోస్టర్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మేకర్స్‌

Sreeleela: ‘పుష్ప 2’ కిస్సిక్‌ సాంగ్‌లో శ్రీలీల ఫిక్స్‌ – పోస్టర్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మేకర్స్‌

Sreeleela Look Release From Pushp 2: ఇండియా మోస్ట్‌ అవైయిటెడ్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్‌ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌ జోరు పెంచింది. 2021 విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి ఇది సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. దీంతో పార్ట్‌ 2పై అంచనాలు నెలకొన్నాయి. దానికితోడు మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్‌, గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది.

దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న పుష్ప 2 చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూట్‌ కూడా పూర్తి కావోస్తోందని సినీవర్గాల నుంచి సమాచారం. ఈ నేపథ్యంలో మూవీ టీం ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. పుష్ప 2లో స్పెషల్‌ సాంగ్‌ శ్రీలీల నటిస్తున్నట్టు ఇప్పటికే ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్‌ శ్రీలీల లుక్‌ని రిలీజ్‌ చేశారు. టీం పుష్ప.. వెల్‌కమ్‌ అన్‌బోర్డు డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల. కిస్సిక్‌ సాంగ్‌లో ఆమె అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులు వేయబోతుంది. ఈ పాట ఆడియన్స్‌కి డ్యాన్స్‌ ఫీస్ట్‌ ఇవ్వబోతుందంటూ మూవీ టీం పేర్కొంది. ఈ పోస్టర్‌ చూసి ఫ్యాన్స్‌ అంతా ఊగిపోతున్నారు.

కాగా పుష్ప: పార్ట్‌ వన్‌లో ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా పాటకు ఎంతటి క్రేజ్‌ వచ్చిందో తెలిసిందే. ఇంటర్నేషనల్‌ స్టేజ్‌పై ఈ పాట మారుమోగింది. ఇందులో సమంత, అల్లు అర్జున్‌ స్టేప్పులు బాగా ఆకట్టుకున్నాయి. దీంత పుష్ప 2లోనూ అదే రేంజ్‌లో పాట ఉండేలా సుకుమార్‌ భారీగా ప్లాన్‌ చేశారు. అందుకే డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీలను రంగంలోకి దీంపి పాట మరింత హైప్‌ క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం శ్రీలీల పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్‌ వస్తుంది. కాగా ముందు నుంచి ఈ పాటలో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపర్‌ నటించనుందంటూ ప్రచారం జరిగింది. మేకర్స్ ఆమెను సంప్రదించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆమె డేట్స్‌ దొరకకపోవడంతో ఆఖరికి శ్రీలీలను ఈ పాటకు తీసుకున్నట్టు తెలుస్తోంది.