Last Updated:

Vande Bharat : రేపు ఆరవ వందే భారత్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రకటించిన 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలనే సవాలు లక్ష్యం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది.

Vande Bharat : రేపు ఆరవ వందే భారత్  రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Vande Bharat: ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్రదినోత్సవం సందర్బంగా ప్రకటించిన 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలనే సవాలు లక్ష్యం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ఆదివానం నాగ్‌పూర్ మరియు బిలాస్‌పూర్‌లను కలుపుతూ ఆరవ రైలు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 11న ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆగస్ట్ 2023 నాటికి కనీసం 75 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గడువుకు ఇంకా ఎనిమిది నెలల సమయం మిగిలి ఉంది.మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 15, 2019న న్యూఢిల్లీ మరియు వారణాసి మధ్య ప్రారంభించారు. ఐదవ రైలు 2022 నవంబర్ 11న మైసూరు మరియు చెన్నై మధ్య మార్చి 12, 2021న ప్రారంభమయింది.

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) ఇప్పటివరకు ఐదు వందే భారత్ రైళ్లను తయారు చేసిందని, ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా వీటి ఉత్పత్తిని పెంచుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు. కొత్త రైళ్లు ప్రారంభించే మార్గాల్లో, కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టడం నిరంతర ప్రక్రియ అని అధికారి తెలిపారు.ఇది కార్యాచరణ సాధ్యత, ట్రాఫిక్ జస్టిఫికేషన్, రోలింగ్ స్టాక్ లభ్యత, పోటీ డిమాండ్లు మరియు ఇతర అంశాలకు లోబడి ఉంటుందని ఆయన తెలిపారు2022-23 బడ్జెట్ ప్రసంగంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే మూడేళ్లలో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను అభివృద్ధి చేసి తయారు చేస్తామని ప్రకటించారు. ఇవి మెరుగైన ఇంధన సామర్థ్యం మరియు ప్రయాణీకుల అనుభవాన్ని కలిగి ఉంటాయి.

వందేభారత్ రైలు వేగం గంటకు 160 కి.మీ. బోగీలు పూర్తిగా సస్పెండ్ చేయబడిన ట్రాక్షన్ మోటార్‌లతో పాటు అత్యాధునిక సస్పెన్షన్ సిస్టమ్‌తో పరుగును సున్నితంగా మరియు సురక్షితంగా చేస్తుంది. చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల ప్రాథమిక ఛార్జీలు శతాబ్ది ఎక్స్ ప్రెస్ కన్నా ఎక్కువ . రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ ఛార్జీ, క్యాటరింగ్ ఛార్జీ మరియు GST వంటి ఇతర ఛార్జీలు విడివిడిగా ఉంటాయి. చైర్ కార్ (CC)కి రూ. 1200 మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కి రూ. 2295 గా నిర్ణయించారు.

 

ఇవి కూడా చదవండి: