Last Updated:

Murder: వైఫై పాస్‌వర్డ్ కోసం బాలుడిని చంపిన కిరాతకులు

సమాజంలో రోజు రోజుకు నేరాలు అధికమౌతున్నాయి. సంబంధం లేని వ్యవహారాల్లో కూడా క్షణికావేశాలకు గురౌతున్నారు. ఈ క్రమంలోనే వైఫై పాస్వర్డ్ చెప్పలేని కారణంగా ఓ బాలుడిని కత్తి పొడిచి చంపిన ఘటన ముంబైలో జరిగింది.

Murder: వైఫై పాస్‌వర్డ్ కోసం బాలుడిని చంపిన కిరాతకులు

Mumbai: సమాజంలో రోజు రోజుకు నేరాలు అధికమౌతున్నాయి. సంబంధం లేని వ్యవహారాల్లో కూడా క్షణికావేశాలకు గురౌతున్నారు. ఈ క్రమంలోనే వైఫై పాస్‌వర్డ్ చెప్పలేని కారణంగా ఓ బాలుడిని కత్తి పొడిచి చంపిన ఘటన ముంబైలో జరిగింది.

పోలీసుల సమాచారం మేరకు, ముంబైలోని కమోతే ప్రాంతంలోని ఓ పాన్ షాప్ వద్ద విశాల్ రాజ్ కుమార్ మౌర్య అనే 17 ఏళ్ల బాలుడి సెల్ ఫోన్ వైఫై చెప్పాలంటూ రవీంద్ర అత్వాల్, సంతోష్ వాల్మీకి అనే ఇద్దరు వ్యక్తులు కోరారు. దీన్ని నిరాకరించడంతో వారం రోజులుగా మౌర్య ను వెంటాడుతూ వారివురు హేళన చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురి మద్య వాగ్వాదం చోటుచేసుకొనడంతో ఆవేశంతో ఇరువురు వ్యక్తులు కలిసి మౌర్యా పై కత్తితో దాడి చేశారు. వెంటనే నిందితులు పరారైనారు. కత్తిపోటుకు గురైన బాలుడు ఆత్మరక్షణ కై కేకలు వేస్తూ కొద్ది దూరం అడుగులు వేసి రోడ్డు పై ఒరిగిపోయాడు. కత్తి గాయాలతో కొట్టుమిట్టాడుతున్న మౌర్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మౌర్య మృతిచెందాడని వైద్యలు తేల్చారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సమాచారాన్ని మృతుడి కుటుంబసభ్యులకు చేరవేశారు.

ఇది కూడా చదవండి: Morbi bridge incident: మోర్బీ ఘటనలో ప్రజల ప్రాణాలు కాపాడిన మాజీ ఎమ్మెల్యే.. నెట్టింట వైరల్

ఇవి కూడా చదవండి: