Last Updated:

Rape Case : ఆరో తరగతి విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారం..

మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్ధినిలపై కామ వాంఛ తీర్చుకోవడం కోసం దారుణాలకు ఒడిగట్టడం చూస్తున్నాం.

Rape Case : ఆరో తరగతి విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారం..

Rape Case : మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్ధినిలపై కామ వాంఛ తీర్చుకోవడం కోసం దారుణాలకు ఒడిగట్టడం చూస్తున్నాం. ఈ తరహా ఘటనలు వరుసగా జరుగుతుండడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.

ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 7న బాలిక టాయిలెట్‌లో ఉండగా హెడ్మాస్టర్‌తోపాటు మరో ఉపాధ్యాయుడు బలవంతంగా గదిలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజుల తర్వాత కడుపునొప్పిగా ఉందని బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగికదాడి జరిగినట్టు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దిగ్భ్రాంతికి గురైన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్మాస్టర్‌తోపాటు మరో ఉపాధ్యాయుడిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతుండగా.. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య వైద్యాధికారిని కోరింది. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది.