Last Updated:

Taraka Ratna : తారకరత్న కోసం బెంగుళూరుకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.  బెంగళూరులోని నారాయణ హృదయాలయ

Taraka Ratna : తారకరత్న కోసం బెంగుళూరుకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌

Taraka Ratna : సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

తారకరత్నను చూసేందుకు సినీనటులు ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌ తమ కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు.

బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి, ఇతర కుటుంబసభ్యులు కూడా ఆస్పత్రి వద్దకు వెళ్లారు.

బెంగళూరు చేరుకున్న అనంతరం ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌ నేరుగా ఆస్పత్రికి వెళ్లారు.

అక్కడ తారకరత్న కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది.

 

 

అరుదైన వ్యాధితో బాధపడుతున్న తారకరత్న(Taraka Ratna)..

మరోవైపు కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్‌ కూడా నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

తారకరత్న మయోకార్డియల్‌ ఇన్‌ఫార్క్‌షన్‌ కారణంగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు.

నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు అత్యున్నత వైద్యసేవలు అందిస్తున్నారు.

తారకతర్న అరుదైన ‘మెలెనా’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ వ్యాధి కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని అన్నారు.

బ్లీడింగ్ కారణంగా పలు శరీర భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయినట్లు చెప్పారు. మెలైనా వ్యాధి కారణంగా తారకరత్న అధిక ఆయాసంతో బాధపడుతున్నట్లు చెప్పారు.

ఆయనకు గుండెలో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం ద్వారా ఎక్మో (ECMO) ద్వారా చికిత్స అందిస్తున్నామని.., బెలూన్ యాంజియో ప్లాస్టీ ద్వారా బ్లడ్ పంపింగ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సాయంత్రం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వచ్చారు.

ఆయన తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య తదితరులతో మాట్లాడారు.

తారకరత్న ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, కోలుకునేందుకు మరింత సమయం అవసరమని తెలుస్తోందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.

త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరుకు చేరుకున్న సినీనటుడు బాలకృష్ణ వైద్యులతో చర్చించారు.

దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి సుహాసిని, ఎమ్మెల్యే చినరాజప్ప, తెదేపా నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల శ్రీరామ్‌ తదితరులు ఆసుపత్రికి వచ్చారు.

 

 

తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

నారాయణ హృదయాలయలో కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్‌ కేర్‌ స్పెషలిస్టులతో చికిత్సను అందిస్తున్నారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ ఎప్పటికప్పుడు డాక్టర్లతో పర్యవేక్షిస్తున్నారు.

ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ అభిమానులు, తెదేపా నేతలు అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/