Glenn Maxwell Retirement: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మాక్స్‌వెల్
Australia Star Cricketer Glenn Maxwell announces ODI Retirement: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, ఆల్ రౌండర్ మాక్స్‌వెల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే టీ20లకు అందుబాటులో ఉంటానని తెలిపారు. మొత్తం 149 వన్డేల్లో 3,990 పరుగులు చేశారు. ఇందులో 4 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు చేశాడు. 2027 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకొని యువకులకు అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, టెస్ట్ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు.
అలాగే, వన్డేల్లో మాక్స్‌వెల్ అత్యధికంగా 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ డబుల్ సెంచరీ అఫ్గానిస్థాన్ జట్టుపై 2023లో నమోదు చేశాడు. 33.81 యావరేజ్‌తో 126.70 స్ట్రైక్ రేటు, బౌలింగ్ విభాగంలో ఆఫ్ స్పిన్ వేయగా.. 77 వికెట్లు పడగొట్టడంతో పాటు 91 క్యాచ్‌లు పట్టుకున్నాడు.
After a truly memorable ODI career, Glenn Maxwell has called time on that format: https://t.co/ktWUdnmoVM pic.twitter.com/hn5zCZdE5V
— cricket.com.au (@cricketcomau) June 2, 2025