Last Updated:

Ruturaj Gaikwad: ఒకే ఓవర్లో 7 సిక్సులు.. చరిత్ర సృష్టించిన యువ క్రికెటర్

ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు కొట్టి నయా రికార్డు నెలకొల్పాడు రుతురాజ్ గైక్వాడ్. విజయ్‌ హజారే ట్రోఫీలో రెండో క్వార్టర్‌ ఫైనల్‌ సందర్భంగా ఉత్తర్‌ ప్రదేశ్‌పై గైక్వాడ్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు.

Ruturaj Gaikwad: ఒకే ఓవర్లో 7 సిక్సులు.. చరిత్ర సృష్టించిన యువ క్రికెటర్

Ruturaj Gaikwad: క్రికెట్ చరిత్రలో మరో సరికొత్త రికార్డ్ నెలకొంది. యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌ చరిత్ర సృష్టించాడు. గతంలో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టి భారత స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కానీ ఆరు బంతులకు ఏడు సిక్సులు కొట్టడం మాత్రం ఎక్కడైనా చూశామా ఇదెలా సాధ్యం అనుకుంటున్నారు కదా అయితే ఈ కథనం చదివెయ్యండి.

ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు కొట్టి నయా రికార్డు నెలకొల్పాడు రుతురాజ్ గైక్వాడ్. విజయ్‌ హజారే ట్రోఫీలో రెండో క్వార్టర్‌ ఫైనల్‌ సందర్భంగా ఉత్తర్‌ ప్రదేశ్‌పై గైక్వాడ్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. మహారాష్ట్ర తరఫున ఆడుతున్న గైక్వాడ్‌.. శివ సింగ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. మైదానం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. శివ వేసిన ఓవర్‌లో ప్రతి బంతిని సిక్స్ గా మార్చేశాడు. ఒక నోబాల్‌ పడటంతో ఏడు బంతులకు గానూ ఏడు సిక్స్‌లు బాదాడు. ఆ ఓవర్లో మొత్తంగా 43 పరుగులు రాబట్టాడు. దీంతో మహారాష్ట్ర 50 ఓవర్లకు 330 పరుగులు చేసింది. గైక్వాడ్‌ 159 బంతులు 220పరుగులు చేశాడు. అందులో 10 ఫోర్లు 16 సిక్సులు ఉన్నాయి.

ఇదీ చదవండి: బీసీసీఐకి గిన్నిస్ బుక్ రికార్డ్

ఇవి కూడా చదవండి: