Last Updated:

Minister KTR: మీడియా ముందు నోరుజారద్దు.. పార్టీ శ్రేణులకు కేటిఆర్ సూచన

ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ వ్యవహారంలో గంటలు గడిచే కొద్ది పలు కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తెరాస ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో పోలీసుల ఎఎఫ్ఐఆర్ పై భాజపా న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది.

Minister KTR: మీడియా ముందు నోరుజారద్దు.. పార్టీ శ్రేణులకు కేటిఆర్ సూచన

Hyderabad: ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ వ్యవహారంలో గంటలు గడిచే కొద్ది పలు కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తెరాస ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో పోలీసుల ఎఎఫ్ఐఆర్ పై భాజపా న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ క్రమంలో తెరాస నేత కేటిఆర్ ట్విటర్ వేదికగా పార్టీ శ్రేణులకు మీడియా ముందు నోరుజారద్దు అంటూ సూచించారు.

కేసు ప్రాధమిక దశలో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యానాలు చేయద్దంటూ ఆయన పేర్కొన్నారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చిన్నట్లు మొరుగుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవద్దని ఆయన ట్వీట్ చేశారు.

నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా చోటుచేసుకొన్న రూ. 400కోట్ల 4గురి తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుపై తొలుత భాజపాపై తెరాస నేతలు విరుచకపడ్డారు. అయితే అనంతరం నేడు భాజపా కీలకనేతలు దాన్ని తిప్పికొట్టారు. న్యాయస్ధానాన్ని కూడా ఆశ్రయించివున్నారు. పోలీసులు కూడా మీడియా సమక్షంలో ఎంత నగదు పట్టుబడిందో తెలపలేదు. ఈ క్రమంలో కేటిఆర్ ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కూడా కవిత హస్తం ఉందంటూ భాజపా నేతల మాటల పై తెరాస పార్టీ శ్రేణుల కాని, కేటిఆర్ గాని ఎక్కడా ఖండించలేదు. కవిత మాత్రం సీబీఐ నాకు నోటీసులు ఇచ్చిన్నప్పుడు మీకు సమాధానం చెబుతానంటూ మీడియాను వేడుకొని వున్నారు.

ఇది కూడా చదవండి: Operation Akarsh: తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ లో కీలక మలుపు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భాజపా

ఇవి కూడా చదవండి: