Last Updated:

CPM: కేంద్ర విధానాలపై సిపిఎం పోరుబాట

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు

CPM: కేంద్ర విధానాలపై సిపిఎం పోరుబాట

Ananthapuram: అనంతపురంలో ఆయన కార్యచరణను తెలిపారు. తొలుత భారతీయ జనతా పార్టీ దుష్ట పరిపాలన పేరుతో చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాలు, పెయింటింగులు, గ్రాఫ్ ల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. బీజేపీ ఏం చేస్తుందో ప్రజలకు తెలియచేయడానికి పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 23న పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభలో బృందాకారత్ ప్రసంగిస్తారన్నారు. 24న విజయవాడ సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, 27న విశాఖ పట్నం సభలో బివి రాఘవులు ప్రసంగిస్తారని ఆయన తెలిపారు.

కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పాలనలో దుర్భరమైన పనితీరు కనపరుస్తుందన్న శ్రీనివాసరావు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచి 21-22లో 191 దేశాలకు గాను భారత్ 132వ స్థానంలో ఉండడం అందుకు అద్దం పడుతుందన్నారు. ప్రత్యేక హోదా లో పేర్కొన్న ప్రకారం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణంలో రాష్ట్రానికి మద్దతు ఇవ్వడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూ రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తోంది అని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: