Bharath Jodo Yatra: ఏపీలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. నేడు ఏపీలోకి ఈ యాత్ర ప్రవేశించింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో నేడు మొదలైన రాహుల్ పాదయాత్ర ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది.
Bharath Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. నేడు ఏపీలోకి ఈ యాత్ర ప్రవేశించింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో నేడు మొదలైన రాహుల్ పాదయాత్ర ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. కాగా మళ్లీ సాయంత్రం 04.30 గంటలకు ఈ పాదయాత్ర మొదలు కానుంది. సాయంత్రం 6.30 గంటలకు అనంతపురం జిల్లా ఓబులాపురం గ్రామంలో రాహుల్ పాదయాత్ర ఆగనుంది. కర్ణాటక బళ్లారిలోని హలకుంది మఠ్ సమీపంలో రాహుల్ గాంధీ రాత్రికి బస చేయనున్నారు.
ఉదయం 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి, భారత్ జోడో యాత్రికులకు ఘనస్వాగతం ఏపీ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగే రూట్లో ఏర్పాట్లను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం, కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కే రాజు, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజు, ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గురునాథ్ రావు పరిశీలించారు. అయితే ఏపీలో 5 రోజుల పాటు ఈ భారత్ జోడో యాత్ర సాగనుంది.
ఇదీ చదవండి: ఏపీ- తెలంగాణ మధ్య ఐకానిక్ వంతెన.. దేశంలోనే మొదటిదిగా..!