BREAKING NEWS: విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్ పై వచ్చేందుకు సిద్ధమవుతున్న వలస కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు.
Ananthapuram: ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్ పై వచ్చేందుకు సిద్ధమవుతున్న వలస కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు.
అనంతపురం జిల్లాలోని బొమ్మనహల్ మండలం దర్గాహొన్నూరులో విషాదం నెలకొంది. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ లో వెళ్తున్న సమయంలో విద్యుత్ మెయిన్ లైన్ తెగి పడి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ట్రాక్టర్ ఎక్కే సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి వారిని సమీపంలోని బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది జూన్ 30న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలంలో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీల ఆటోపై విద్యుత్ వైర్లు తెగిపడి ఐదుగురు కూలీలు సజీవదహనం అయ్యిన ఘటన మరవక ముందే మరల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోవడం పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యుత్ అధికారులు మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: సుపారీ ఇచ్చి మరీ.. కొడుకుని హత్య చేయించిన తల్లిదండ్రులు