Last Updated:

CM MK Stalin: ప్రధాని మోదీకి పొన్నియిన్ సెల్వన్ నవలను బహుమతిగా ఇచ్చిన సీఎం స్టాలిన్

ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ పొన్నియిన్ సెల్వన్ నవలను బహుమతిగా ఇచ్చారు. శుక్రవారం దిండిగల్ లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ (జిఆర్‌ఐ) 36వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి స్టాలిన్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

CM MK Stalin: ప్రధాని మోదీకి పొన్నియిన్ సెల్వన్ నవలను బహుమతిగా ఇచ్చిన సీఎం స్టాలిన్

Tamil Nadu: ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ పొన్నియిన్ సెల్వన్ నవలను బహుమతిగా ఇచ్చారు. శుక్రవారం దిండిగల్ లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ (జిఆర్‌ఐ) 36వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి స్టాలిన్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి తమిళ నవల “పొన్నియిన్ సెల్వన్” ఆంగ్ల అనువాదాన్ని బహుకరించారు.

పొన్నియిన్ సెల్వన్ 1950లలో కల్కి కృష్ణమూర్తిచే రాయబడింది. ఈ నవల చోళ సామ్రాజ్య కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఒక చారిత్రక కల్పన. దీని ఆధారంరగా దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించారు. అది ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లు మరియు ఒటిటి ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయబడింది.

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భగవద్గీత ప్రతిని బహూకరించారు. అతని రాబోయే అంతర్జాతీయ పోటీలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరజ్ చోప్రా దేశానికి, రాష్ట్రానికి కీర్తిని తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి: