Last Updated:

CM Jagan: పవన్ పై సీఎం జగన్ కౌంటర్ ఎటాక్.. వీధి రౌడీలు కూడా అలా మాట్లాడరంటూ ఫైర్

పవన్‌ వ్యాఖ్యలకు అవనిగడ్డ వేదికగా సీఎం జగన్‌ కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు. ఏం చేయలేనివాళ్లు బూతులు తిడుతున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Jagan: పవన్ పై సీఎం జగన్ కౌంటర్ ఎటాక్.. వీధి రౌడీలు కూడా అలా మాట్లాడరంటూ ఫైర్

CM Jagan: ఎన్టీఆర్‌ జిల్లాలోని అవనిగడ్డలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన విజయవంతంగా జరిగింది. 22ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను సీఎం జగన్‌ రైతులకు అందజేశారు. దీనితో ఇక్కడి రైతులకు ఆ భూములపై సర్వహక్కులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా భూములకు కచ్చితమైన రికార్డులు లేవని, రికార్డుల్లో వివరాలు పక్కాగా లేకపోవడంతో అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. వంద ఏళ్ల తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నామని ఇకపై రైతులకు ఏ ఇబ్బందులు రావని సీఎం జగన్ అన్నారు. ఇదిలా ఉండగా పవన్ కు ఈ వేదికపైనే సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

పవన్‌ వ్యాఖ్యలకు అవనిగడ్డ వేదికగా సీఎం జగన్‌ కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు. ఏం చేయలేనివాళ్లు బూతులు తిడుతున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివాళ్లా మన నాయకులంటూ జగన్ ప్రశ్నించారు.
ఇది మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న వార్ అని, పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని సీఎం జగన్ చెప్పారు. మరో 19 నెలల పాటు రోజూ ఈ పోరాటం కనిపిస్తూనే ఉంటుందని సీఎం జగన్ అన్నారు. దత్తపుత్రుడు, దత్తపుత్రుడి తండ్రి కలిసి మళ్లీ కుట్రలు చేసేందుకు సిద్ధమయ్యారని, ఆ కుట్రలు కుతంత్రాలు తిప్పి కొట్టేందుకు అందరూ సిద్ధంగా ఉండాలంటూ ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. ఒక్క జగన్ ను ఢీ కొట్టడానికి వీరంతా ఏకమై వస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. మనం మూడు రాజధానులు కావాలి అంటే.. ఓ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకోండి, భార్యను వదిలేయండి అని చెబుతారా.? ఇలాంటి నాయకులా మనకు దిశా నిర్ధేశం చేసేది అంటూ ఆయన మండిపడ్డారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ మూడు రోజుల మకాం.. మునుగోడులో ఏం జరుగనుంది..!

ఇవి కూడా చదవండి: