Published On:

Pawan Klayna: తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు పవన్ శుభాకాంక్షలు

Pawan Klayna: తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు పవన్ శుభాకాంక్షలు

Pawan kalyan : ఏపీ, తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షులు మాధవ్, రామచందర్ రావుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్న మాధవ్.. శాసన మండలి సభ్యుడిగా పలు ప్రజా సమస్యలపై, యువత, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలను చట్టసభలో ప్రస్తావించారన్నారు. జాతీయవాద దృక్పథం కలిగిన నాయకుడన్నారు.

 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్.. కూటమి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్ రావుకు పవన్ అభినందనలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించిన రామచందర్ రావు.. ఎమ్మెల్సీగా ప్రజా గళాన్ని శాసనమండలిలో వినిపించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా చేపడతారని.. కేంద్ర ప్రభుత్వం జాతీయ దృక్పథంతో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నానన్నారు.

 

బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచంద్రరావుకు ఎంపీ ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ లక్ష్యాలను సాధించే బాధ్యత ప్రతీ ఒక్క కార్యకర్త, నాయకుల మీద ఉందన్నారు. తనకు, ఆయనతో చాలా రోజుల నుంచి మంచి స్నేహం ఉందని.. చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల్లో కలిసి పనిచేశామన్నారు. సౌమ్యుడు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్త అని.. అనేక విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నేత రాంచంద్రరావు అని కొనియాడారు. శాసనమండలిలో తాము మంత్రులుగా ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఒక్కరే ఎమ్మెల్సీగా ఉండి.. చాలా గొప్ప పాత్ర నిర్వహించారన్నారు. కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో మందు భాగంలో ఉంటారని ఆకాంక్షిస్తూ.. తాము సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు ఎంపీ ఈటల.

ఇవి కూడా చదవండి: