Top 3 Smartphones Under 30000: రూ.30 వేలల్లో ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. వీటిని అస్సలు మిస్ కావొద్దు..!

Top 3 Smartphones Under 30000: ఇప్పుడు మిడ్-రేంజ్ విభాగంలో చాలా మంచి 5G స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు డిజైన్ నుండి పనితీరు పరంగా నిరాశ చెందడానికి ఎటువంటి అవకాశం ఇవ్వవు. అయితే మీరు రూ.30,000 బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే.. ప్రస్తుతం మూడు టాప్ క్లాస్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy M56
మీ బడ్జెట్ రూ. 30,000 కంటే తక్కువ ఉంటే, శాంసంగ్ గెలాక్సీ M56 మీకు బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ డిజైన్ కొత్తగా ఉంటుంది. ఇందులో 6.74 అంగుళాల సూపర్ అమోలెడ్ ప్లస్, 120GHz డిస్‌ప్లే ఉంది. ఫోటోగ్రఫీ, వీడియో కోసం, 50MP+8MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ కోసం అయితే 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో ఎక్సినాక్స్ 1480 ప్రాసెసర్ ఉంది. దీనిలో 5000 mAh బ్యాటరీ ప్యాక్ చూడచ్చు. ఈ ఫోన్ వన్ UI 7 ఆధారంగా ఆండ్రాయిడ్‌లో పనిచేస్తుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ.27,999.
iQOO Neo 10
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ కూడా మంచి స్మార్ట్‌ఫోన్. యువత ఈ ఫోన్ డిజైన్‌ను ఇష్టపడతారు. దీనిలో 6.78 అంగుళాల అమోలెడ్, 120Hz డిస్‌ప్లే ఉంది. ఫోటోగ్రఫీ, వీడియో కోసం 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ఉంది. దీనికి 7000 mAh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ ఫోన్ ఫన్‌టచ్ ఓఎస్ 15 ఆధారంగా ఆండ్రాయిడ్‌పై పనిచేస్తుంది. దీని 8GB+128GB వేరియంట్ ధర రూ.29,999.
Poco F7
పోకో F7 స్మార్ట్‌ఫోన్ దాని సరళమైన డిజైన్ కారణంగా వినియోగదారులకు నచ్చుతోంది. ఈ ఫోన్ 6.83 అంగుళాల ఓఎల్ఈడీ, 120Hz డిస్‌ప్లే ఉంది. ఫోటోగ్రఫీ, వీడియో కోసం 50MP+8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, అయితే దీనికి 20MP ఫ్రంట్ కెమెరా ఉంది. పఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ఉంది. దీనికి 7550 mAh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ ఫోన్ హైపర్ ఓఎస్ 2.0 ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీని 8GB+128GB వేరియంట్ ధర రూ.29,999.