Munugode: సీఎం కేసీఆర్ మూడు రోజుల మకాం.. మునుగోడులో ఏం జరుగనుంది..!
అన్ని ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇకపై మునుగోడు రంగంలోకి సీఎం కేసీఆర్ దిగనున్నారని సమాచారం.
Munugode: తెలంగాణలో మునుగోడు బైపోల్ రాజకీయ కాక పుట్టిస్తోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ మునుగోడులో రోజురోజు పరిణామాలు మారిపోతున్నాయి. ఏ రోజు ఏం జరుగుతుందా అనే ఆసక్తి స్థానిక ప్రజల్లో పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇకపై మునుగోడు రంగంలోకి సీఎం కేసీఆర్ దిగనున్నారని సమాచారం.
ఇప్పటి వరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించబోతున్నారని సమాచారం. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా మునుగోడులో కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, మూడు రోజుల పాటు ఆయన అక్కడే మకాం వేసి అక్కడి ఓటర్లను కలుస్తారని సమాచారం. ఈ నెల 29, 30, 31 తేదీల్లో మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ప ర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. 31న భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
కాగా నవంబర్ 1తో ప్రచార పర్వం ముగియనుంది. నవంబర్ 3న పోలింగ్ జరుగనుంది.
ఇదీ చదవండి: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడులో తీవ్ర కలకలం