KCR: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

KCR Discharge From Hospital: అనారోగ్యానికి గురై యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. షుగర్, సోడియం లెవల్స్ కంట్రోల్ లోకి వచ్చాయి. జ్వరం కూడా తగ్గడంతో ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి చేరింది. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల పాటు కేసీఆర్ నందినగర్ నివాసంలో ఉండనున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతలతో నిన్న చిట్ చాట్ నిర్వహించారు. పార్టీ అంశాలపై చర్చించారు. ఆరోగ్యపరంగా కేసీఆర్ కు పెద్దగా ఇబ్బంది లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో పరీక్షల అనంతరం ఇవాళ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు.
ఆస్పత్రిలో పార్టీ నేతలతో నిన్న కేసీఆర్ మాట్లాడారు. ‘కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటపై నేను త్వరలోనే స్పందిస్త.. ప్రజల ముందు వాస్తవాలను పెడత’ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నేతలు రాష్ట్రంలోని రైతుల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.