Chiranjeevi: నా తమ్ముడు అలా అయిపోతే నాకు కన్నీళ్లే వస్తాయి..
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించగా.. రవితేజకు జోడీగా కేథరిన్ నటించింది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య”. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు.
ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించగా.. రవితేజకు జోడీగా కేథరిన్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
మెగాస్టార్ డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ లలో అదరగొట్టారని చెబుతున్నారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ మాస్ అవతార్ లో దుమ్ము లేపారని అంటున్నారు.
గతంలో అన్నయ్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి నటించిన రవితేజ.. మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
మళ్లీ వారిద్దరినీ సిల్వర్ స్క్రీన్‌పై కలిసి చూడటం కన్నుల పండుగగా ఉందంటున్నారు. బాస్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.
తమ్ముడి గురించి చెప్తూ ఎమోషనల్ అయిన చిరు
ఈ సంధర్భంగా చిరంజీవి(Chiranjeevi) మాట్లాడుతూ.. రవితేజ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నేను ఈ సినిమా కోసం కష్టపడలేదు.
నా బాధ్యతగా అనుకుని పనిచేశా. కష్టం నాది, రవితేజది కాదు.. సినిమా బాగా రావాలని పనిచేసిన వారిందరిదీ అని అన్నారు. ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టే అంత బాగా చేయగలిగానన్నారు. రవితేజ తప్ప ఈ క్యారెక్టర్ మరొకరు న్యాయం చేయలేరన్నారు. నిజంగా రవితేజ నాకు తమ్ముడు లాంటివాడు అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
నా తమ్ముడు అలా అయిపోతే కన్నీళ్లే వస్తాయని వెల్లడించారు.
అలానే వాల్తేరు వీరయ్య విజయంతో నాకు మాటలు రావడం లేదన్నారు. ఈ సినిమా కోసం వారు పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని మెగాస్టార్ అన్నారు.
ఈ మేరకు వాల్తేరు వీరయ్య సినిమా కోసం పనిచేసిన కార్మికులను చిరంజీవి స్వయంగా ఘాట్ చేసిన వీడియోను విడుదల చేశారు.
విజయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ సినీ కార్మికుల కష్టం మనకు తెలియాలన్నారు. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పనిచేసిన కార్మికులది.
మన మీదతో జాలితో కాదు.. సినిమాపై ప్రేమతో కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి అని తెలిపారు.
ఈ సినిమా కోసం అందరు పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని మెగాస్టార్ అన్నారు.
ఈ మేరకు వాల్తేరు వీరయ్య సినిమా కోసం పనిచేసిన కార్మికులను చిరంజీవి స్వయంగా ఘాట్ చేసిన వీడియోను విడుదల చేశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/