Published On:

Apple Days Sale in May: ఐఫోన్ ఇక్కడే కొంటే భారీ డిస్కౌంట్.. ఒక్కో మోడల్‌పై వేలల్లో తగ్గింపులు.. డీల్స్ అదిరాయ్ మచ్చా..!

Apple Days Sale in May: ఐఫోన్ ఇక్కడే కొంటే భారీ డిస్కౌంట్.. ఒక్కో మోడల్‌పై వేలల్లో తగ్గింపులు.. డీల్స్ అదిరాయ్ మచ్చా..!

Offers on iPhone 16 Series, 15 Series  in Appl Days Sale: అందరూ ఎదురుచూస్తున్న యాపిల్ డేస్ రానే వచ్చాయి. బంపర్ డిస్కౌంట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మీ నిరీక్షణ ముగిసినట్లే. ఈ ప్రయోజనాలు విజయ్ సేల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. శనివారం ప్రారంభమైన ఈ సేల్ జూన్ 1 వరకు కొనసాగుతుంది. ఈ వారంలో కొత్త, పాత ఐఫోన్ మోడళ్లపై ప్రత్యేక తగ్గింపులు అందిస్తున్నారు. ఐఫోన్ 16, ఐఫోన్ 15 పై రూ.13,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

iPhone 16 Series Offers

ఈ సేల్ సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ఐఫోన్ 16 సిరీస్ కొనుగోలుపై కస్టమర్లకు రూ.4000 వరకు తగ్గింపు ఇస్తున్నారు. అలానే ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులు ఉన్నాయి. ఆఫర్ల కారణంగా ఐఫోన్ 16 మొబైల్ 128GB వేరియంట్ రూ. 66,990 కు అందుబాటులో ఉంది, అయితే ఈ ఫోన్ రూ. 79,900 ధరకు లాంచ్ అయింది. ఫోన్‌పై మొత్తం మీద రూ.12,910 ప్రత్యక్ష తగ్గింపు లభిస్తుంది.

 

iPhone 16 Plus Offers

ఆఫర్ల కారణంగా కస్టమర్లు ఐఫోన్ 16 ప్లస్ బేస్ 128GB వేరియంట్‌ను రూ. 74,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రూ.89,900 ధరకు లాంచ్ అయింది. యాపిల్ కొత్త ఐఫోన్ 16e అసలు ధర రూ.59,900 కాగా, ఇప్పుడు రూ.47,990 ధరకు ఆర్డర్ చేయవచ్చు.

 

iPhone 16 Pro Offers

ప్రో మోడల్స్ గురించి మాట్లాడుకుంటే, ఐఫోన్ 16 ప్రో 128GB స్టోరేజ్ వేరియంట్‌ను ఈ సేల్‌లో దాని లాంచ్ ధర రూ. 119,900 కు బదులుగా రూ. 103,990 కు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, కస్టమర్లు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ బేస్ 256GB స్టోరేజ్ వేరియంట్‌ను అసలు లాంచ్ ధర రూ. 144,900 కు బదులుగా రూ. 127,650 కు ఆర్డర్ చేయవచ్చు.

 

iPhone 15 Series Offers

ఐఫోన్ 15 సిరీస్ వెనిల్లా మోడల్‌ను లాంచ్ ధర రూ. 79,900 కు బదులుగా రూ. 58,490 కు కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు లభిస్తోంది. ఇది కాకుండా, కస్టమర్లు ఐఫోన్ 15 ప్లస్‌ను రూ. 66,990 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ కారణంగా, మీరు ఈ సేల్‌లో ఐఫోన్ 13ని రూ. 42,790కి కొనుగోలు చేయగలరు. అన్ని మోడళ్లకు రూ. 7,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తున్నారు.