Last Updated:

Cheating case: మాజీ మంత్రి, మాజీ సీపీ కుమారుడి పై చీటింగ్ కేసు

మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ సీపీ ఏకే ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్‌ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే షబ్బిర్ అలీ, మోసిన్ ఖాన్. ఎక్కువ లాభాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి తన వద్ద నుంచి దాదాపు 90 లక్షల రూపాయల వరకు తీసుకున్నారని మహమ్మద్ అబ్ధుల్ వహాబ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

Cheating case: మాజీ మంత్రి, మాజీ సీపీ కుమారుడి పై చీటింగ్ కేసు

Hyderabad: మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ సీపీ ఏకే ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్‌ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే షబ్బిర్ అలీ, మోసిన్ ఖాన్. ఎక్కువ లాభాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి తన వద్ద నుంచి దాదాపు 90 లక్షల రూపాయల వరకు తీసుకున్నారని మహమ్మద్ అబ్ధుల్ వహాబ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 2016లో ఏకే ఖాన్ కుమాడురు తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని. అబ్దుల్ వహబ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా రామానుజవరం గ్రామంలో 46 ఎకరాల రీచ్ కు కాంట్రాక్ట్ లభించిందని మోహిన్ ఖాన్ చెప్పినట్లు బాధితుడు అబ్ధుల్ వహాబ్ చెబుతున్నారు. పెట్టుబడి కోసం డబ్బులు ఇవ్వమంటే తాను నిరాకరించానని, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో మోహిన్ ఖాన్ సిఫార్సు చేయించాడని పేర్కొన్నారు. దాంతో తాను డబ్బు ఇచ్చానని, ఆ సమయంలో వచ్చే లాభాల్లో కొతం వాటా ఇస్తానని మోసిన్ ఖాన్ చెప్పినట్లు వివరించాడు. ఇప్పటికీ లాభాలు ఇవ్వకపోవడం వల్ల తాను కోర్టును ఆశ్రయించినట్లు వివరించాడు.

ఇవి కూడా చదవండి: