Last Updated:

Russian Bat Virus Khosta-2: కరోనా కంటే డేంజర్… మానవాళికి మరో వైరస్ ముప్పు..!

కరోనా కంటే డేంజర్ అయిన వైరస్ ఒకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఇప్పుడు గబ్బిలాల నుంచి మానవాళికి సోకుతుందని అమెరికన్‌ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న ఈ వైరస్‌కు ఖోస్టా-2గా నామకరణం చేశారు.

Russian Bat Virus Khosta-2: కరోనా కంటే డేంజర్… మానవాళికి మరో వైరస్ ముప్పు..!

Russian Bat Virus Khosta-2: ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే కరోనాకి ముందు.. కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పండింది. కొత్తకొత్త వైరల్ వ్యాపిస్తూ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక దాని నుంచి తేరుకునే లోపే మరో వైరస్‌ దాడి చేస్తుంది. ఈ క్రమంలోనే మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది అమెరిక. కరోనా కంటే డేంజర్ అయిన వైరస్ ఒకటి ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు గబ్బిలాల నుంచి మానవాళికి మరో పెద్ద ముప్పు పొంచి ఉందని అమెరికన్‌ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న వైరస్‌కు ఖోస్టా-2గా నామకరణం చేశారు. ఇది రష్యా గబ్బిలాలో 2020లోనే అమెరికా సైంటిస్టులు గుర్తించారు. కానీ ఆ సమయంలో అది మనుషులకు అంతగా ప్రమాదం కలిగిస్తుందని అనుకోలేదని సుదీర్ఘ పరిశోధనల అనంతరం నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ఒకసారి మనిషిలోకి ప్రవేశిస్తే కణజాలంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని, దీని విజృంభణ, ముప్పు రెండూ తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఖోస్టా2 కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌ అని కా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మనిషి కణాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకించడంతో పాటు ప్రస్తుత వ్యాక్సిన్‌లకు ఈ వైరస్‌ నిరోధకతను కలిగి ఉంటుందని సైంటిస్టులు నిర్దారించారు.

సార్స్‌-కోవ్‌-2కి చెందిన వైరస్‌ ఖోస్టా-2. ఇది కూడా కరోనా వైరస్‌ ఉపవర్గానికి చెందిన వైరస్. టైమ్స్ కథనం ప్రకారం.. ఖోస్టా-1 అనేది మనుషులకు వ్యాప్తి చెందదు కానీ, ఖోస్టా-2 మాత్రం మనుషుల్లో ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుందని పేర్కొనింది. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నుంచి కోలుకున్న వాళ్లు, వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు కూడా ఈ వైరస్ నుంచి తప్పించుకోలేరని. సార్స్‌-కోవ్‌-2 వైరస్ జన్యువులతో కలిస్తే మాత్రం ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయని మైకేల్‌ లెట్కో ఓ అధ్యయనం ద్వారా పేర్కొన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఈ వైరస్‌ విజృంభణ, వ్యాక్సినేషన్‌ తయారీపై ఒక అంచనాకి రాలేమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండిEarthquake In Indonesia: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. సునామీ భయంతో పరుగులు తీసిన జనం

ఇవి కూడా చదవండి: