Bandla Ganesh: టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం కావాలి – సినీ ప్రముఖులపై బండ్ల గణేష్ సంచలన కామెంట్స్, ట్వీట్ వైరల్
Bandla Ganesh Shocking Tweet: బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడు, నిర్మాత అయిన ఆయన తరచూ తన వ్యాఖ్యలతో కాంట్రవర్సల్ అవుతుంటారు. సినీ ప్రముఖులపై, రాజకీయ నాయకులపై సటైరికల్ కామెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో విమర్శలు,ట్రోల్స్ బారిన పడుతుంటారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తన పోస్ట్‌లో సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
నవంబర్ 8న సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీర్‌తో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్‌తో పాటు తదితరులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. అయితే కొందరు సినీ ప్రముఖులు, నిర్మాతలు ఆయనకు విషెస్ చెప్పలేదు.
దీనిపై బండ్ల గణేష్ తనదైన స్టైల్లో స్పందిస్తూ ట్వీట్ చేశారు. “గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సినీ ప్రముఖులందరికి ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టీకెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కవాలను” అంటూ సీఎంఓను ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. బండ్ల గణేష్ కామెంట్స్‌పై నెటిజన్లను రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో సినీ ఇండస్ట్రీకి మధ్య కొంత గ్యాప్ ఉందనేది తెలిసిందే. సాధారణం సినీ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వంతో సత్సబంధాలను కొనసాగిస్తుంది.
ఎలాంటి సమస్య వచ్చిన ప్రభుత్వంతో చర్చలు జరిపి సాల్వ్ చేసుకుంటారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలుగు ఇండస్ట్రీ మంచి సన్నిహిత బంధాన్ని కొనసాగించింది. కానీ రేవంత్ రెడ్డి సర్కారుతో మాత్రం ఇండస్ట్రీకి కాస్తా గ్యాప్ కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలు, బడా నిర్మాతలు మాత్రమే సన్నిహితంగా కనిపిస్తున్నారు. మిగతా సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వంతో అంత సఖ్యత లేదనేది కొందరి అభిప్రాయం. ఆయన పుట్టిన రోజు అది స్పష్టంగా కనిపించింది. దీనికి కారణం కూడా అందరికి తెలిసిందే. నంది అవార్డు స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అయితే ఈ ప్రకటన చేసి నెలలు గడిచిన దీనిపై సినీ ప్రముఖులేవరు స్పందించలేదు. దీంతో సీఎం స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సినీ కళాకారులను గద్దర్ అవార్డులతో సత్కరిస్తుందని ప్రకటన చేసినా.. ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఇది తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చోరవ ఈ వ్యవహరం సద్దుమనిగింది. ఈ తరుణంలో సినీప్రముఖులను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేయడం దుమారం రేపుతుంది. మరి బండ్ల గణేష్ ట్వీట్‌పై సినీ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.