Last Updated:

Surrogacy: సరోగసీ.. కొడుకు బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

ఒక తల్లి సరోగేట్‌గా మారి, యునైటెడ్ స్టేట్స్‌లోని ఉటాహ్‌లో తన కొడుకు బిడ్డకు జన్మనిచ్చింది. జెఫ్ హాక్ అనే వ్యక్తి తన భార్య గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చిన తర్వాత పలు ఎంపికలను పరిశీలించారు. చివరకి సరోగసీని ఆశ్రయించాలనుకున్నారు.

Surrogacy: సరోగసీ.. కొడుకు బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

Utah: ఒక తల్లి సరోగేట్‌గా మారి, యునైటెడ్ స్టేట్స్‌లోని ఉటాహ్‌లో తన కొడుకు బిడ్డకు జన్మనిచ్చింది. జెఫ్ హాక్ అనే వ్యక్తి తన భార్య గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చిన తర్వాత పలు ఎంపికలను పరిశీలించారు. చివరకి సరోగసీని ఆశ్రయించాలనుకున్నారు. జెఫ్ హాక్ యొక్క 56 ఏళ్ల తల్లి నాన్సీ హాక్ అతనికి సర్రోగేట్‌గా ముందుకు వచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇది అందమైన క్షణంగా హాక్ వర్ణించారు.

నాన్సీ హాక్ దీని పై మాట్లాడుతూ ఇది అద్భుతమైన మరియు ఆధ్యాత్మిక అనుభవం” అని తెలిపింది. పాప అమ్మమ్మకు నివాళిగా ఆ చిన్నారికి హన్నా అని పేరు పెట్టారు. ఉటా టెక్ యూనివర్శిటీలో పనిచేస్తున్ననాన్సీ, పరీక్ష లేకుండా కూడా తనకు ఆడపిల్లే పుడుతుందని నమ్మకంగా ఉండేది.

దీనిపై డాక్టర్ రస్సెల్ ఫౌల్క్ మాట్లాడుతూ మహిళ తన మనవలకు జన్మనివ్వడం అసాధారణం అయినప్పటికీ, వయస్సు నిజంగా పరిమితం చేసే అంశం కాదు. ఇది వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించినదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: