Russian commander: రష్యా కమాండర్ నిర్వాకం.. పెంపుడు పిల్లిని తరలించేందుకు రెండు మిలటరీ హెలికాప్టర్లు
ఉక్రెయిన్‌లో యుద్ధ సమయంలో తన పెంపుడు పిల్లిని రవాణా చేసేందుకు రష్యా కమాండర్ రెండు మిలటరీ హెలికాప్టర్లను ఉపయోగించాడని రష్యా మాజీ పైలట్ పేర్కొన్నారు.మాక్సిమ్ కుజ్మినోవ్ అనే రష్యా మాజీ పైలట్ ది న్యూ వాయిస్ ఆఫ్ ఉక్రెయిన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Russian commander: ఉక్రెయిన్‌లో యుద్ధ సమయంలో తన పెంపుడు పిల్లిని రవాణా చేసేందుకు రష్యా కమాండర్ రెండు మిలటరీ హెలికాప్టర్లను ఉపయోగించాడని రష్యా మాజీ పైలట్ పేర్కొన్నారు.మాక్సిమ్ కుజ్మినోవ్ అనే రష్యా మాజీ పైలట్ ది న్యూ వాయిస్ ఆఫ్ ఉక్రెయిన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
రెండు హెలికాఫ్టర్లు.. ఆరుగురు సిబ్బంది..(Russian commander)
ఉక్రెయిన్‌లో యుద్ధ సమయంలో రష్యన్ ఎయిర్ ఫోర్స్ ను అసంబంద్దంగా ఉపయోగించుకున్న సందర్బాలు ఏమైనా ఉన్నాయా అని అడిగినపుడు అతను ఈ విషయాన్ని తెలిపారు. తమ కమాండర్ ఒకరు
పిల్లిని మిలిటరీ-గ్రేడ్ హెలికాప్టర్‌లో ఎక్కించారని గంటపాటు ప్రయాణించి వేరొకచోటికి తరలించారని చెప్పారు 114 మైళ్ల ప్రయాణానికి రెండు Mi-8 మరియు Mi-24 (హెలికాప్టర్) సిబ్బందినికేటాయించారని చెప్పారు. దీనికోసం చాలా ఇంధనాన్ని, వనరులను ఉపయోగించామన్నారు. రష్యాలో పైలట్ల కొరత ఉన్నప్పటికీ ఆరుగురు సైనిక సిబ్బంది ఈ పనిలో ఉన్నారని మాజీ పైలట్ చెప్పారు.
28 ఏళ్ల కుజ్మినోవ్ ఇప్పుడు తన మాజీ రష్యన్ సహచరులను రష్యా సైన్యాన్ని విడిచిపెట్టి, పక్కకు మారాలని కోరుతున్నాడు.నిజం ఏమిటంటే, నాజీలు లేదా ఫాసిస్టులు లేరని అన్నారు. అంతేకాదు యుద్ద సమయంలో సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి కూడా అనుమతించలేదన్నారు. తాను ఉక్రెయిన్ వేపు మారడానికి మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రతినిధులతో సంప్రదించానని ,తనకు భద్రతతో పాటు ఆర్థిక బహుమతిని అందించారని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- Ram Charan : ప్రభాస్ #MSMPrecipechallenge ఛాలెంజ్ స్వీకరించిన రామ్ చరణ్.. ఫేవరెట్ వంటకం అదేనా !
- Today Gold And Silver Price : నేటి (సెప్టెంబర్ 7, 2023) బంగారం, వెండి ధరలు..