Oil Tanker Capsizes: ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా.. 13 మంది భారతీయులతో సహా 16 మంది గల్లంతు
16 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న చమురు నౌక ఒమన్ సముద్రంలో బోల్తా పడిందని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ మంగళవారం తెలిపింది. ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే పేరు ఈ నౌకలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమానీ కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
Oil Tanker Capsizes: 16 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న చమురు నౌక ఒమన్ సముద్రంలో బోల్తా పడిందని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ మంగళవారం తెలిపింది. ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే పేరు ఈ నౌకలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమానీ కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
యెమెన్ వైపు వెడుతుండగా..(Oil Tanker Capsizes)
ఈ చమురు నౌక యెమెన్ ఓడరేవు ఆఫ్ అడెన్‌కు వెళుతుండటీ దుక్మ్ పోర్టు సమీపంలో బోల్తా పడింది. 117 మీటర్ల పొడవున్న ఈ నౌకను 2007లో నిర్మించారు. ఇటువంటి చిన్న ట్యాంకర్లను సాధారణంగా చిన్న తీరప్రాంత ప్రయాణాలకు ఉపయోగిస్తారు. ఒమన్ అధికారులు సముద్ర అధికారులతో సమన్వయంతో సంఘటనా స్థలంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.దుక్మ్ నౌకాశ్రయం ఒమన్ యొక్క నైరుతి తీరంలో ప్రధాన చమురు మరియు గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు సమీపంలో ఉంది. ఇది ఒమన్ యొక్క అతిపెద్ద ఏకైక ఆర్థిక ప్రాజెక్ట్.
రెస్క్యూ ఆపరేషన్ లో భారత యుద్ద నౌక ..
చమురు నౌక బోల్తా పడటంతో భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS Teg ఒమన్ తీరంలో సముద్ర నిఘా విమానం P-8Iతో పాటుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు మోహరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. . తప్పిపోయిన సిబ్బందిని ఆచూకీ గాలింపులో భారత యుద్ధనౌక మరియు విమానాలకు ఒమానీ నౌకలు మరియు సిబ్బంది సహాయం చేస్తున్నారు.