Last Updated:

Afghanistan : అఫ్ఘానిస్థాన్ లో పాక్ వైమానిక దాడులు.. టీటీపీ అగ్రనేత హఫీజుల్లా హతం

అఫ్ఘానిస్థాన్లోని నంగర్లోర్లో ఉన్న టీటీపీ శిబిరాలపై . గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్ వైమానిక దాడులు. చేసింది.

Afghanistan : అఫ్ఘానిస్థాన్ లో పాక్ వైమానిక దాడులు.. టీటీపీ అగ్రనేత హఫీజుల్లా హతం

Afghanistan : అఫ్ఘానిస్థాన్ లో ఉన్న టీటీపీ శిబిరాలపై . గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్ వైమానిక దాడులు. చేసింది. ఈ దాడుల్లో టీటీపీ అగ్రనేత హఫీజుల్లా అలియాస్ టూర్ హతమైనట్లు పాక్ నిఘావ ర్గాలు తెలిపాయి. అయితే పాక్ ప్రభుత్వం ఈ వార్తలను నిరాధారమంటూ ఖండించింది. మరోవైపు ఈ దాడుల్లో పిల్లలు సహా 40 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర శాంతి పర్యవేక్షణ సంస్థ అయిన ‘ఆఫ్ఘన్ పీస్ వాచ్’ వ్యవస్థాపకుడు హబీబ్ ఖాన్ తెలిపారు.

ఈ ఘటనను ట్విటర్‌లో ఖండిస్తూ ఖాన్, మొట్టమొదటిసారిగా, పాకిస్తాన్ సైనిక విమానాలు ఆఫ్ఘన్ గడ్డపై తాలిబాన్ ఆధ్వర్యంలో బాంబు దాడి చేసి 40 మందికి పైగా పౌరులను చంపాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ తన ప్రాక్సీ దళాలైన తాలిబాన్ మరియు ముజాహిదీన్ల ద్వారా ఆఫ్ఘన్‌లను చంపుతోంది అని పేర్కొన్నారు. ఈ సర్జికల్ దాడుల్లో పాకిస్థాన్ తన అధునాతన ఎఫ్-16 విమానాలతోపాటు.. మానవ రహిత డ్రోన్లను విని యోగించినట్లు తెలిసింది. దక్షిణ వజీరి స్థాన్లోని తనాయ్ లో ఉన్న టీటీపీ శిబిరాలపై సైన్యం దాడులు జరిపిందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

ఈ దాడుల్లో 11 మంది టీటీపీ ఫైటర్లు హతమైనట్లు పేర్కొన్నాయి. ఈ సంఘటన తరువాత, తాలిబాన్ అధికారులు పాకిస్తాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌ను పిలిపించి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆందోళనలను తెలియజేశారు. దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ తాత్కాలిక మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ, తాత్కాలిక డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ అల్హాజ్ ముల్లా షిరిన్ అఖుంద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పాక్ జాతీయ భద్రత కమిటీ(ఎన్ఎస్సీ) బుధవారం రాత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, టీటీపీతో చర్చలు జరపకూడదని నిర్ణయించింది. . అఫ్ఘాన్ తాలిబాన్లు టీటీపీ వైపు ఉన్నారా? పాకిస్థాన్ వైపా? అనే అంశంపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించామని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనాఉల్లా చెప్పారు.

ఇవి కూడా చదవండి: