Mystery illness in Congo: ముంచుకొస్తున్న మరో భయంకర వ్యాధి.. 48 గంటల్లోనే 50 మంది మృతి

Mystery illness kills 53 people in Congo: ప్రపంచాన్ని వణికించేందుకు మరో వైరస్ దూసుకొస్తుంది. ఈ వైరస్ బారిన పడితే కేవలం 48 గంటల్లోనే చనిపోతున్నారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది వెంటనే అప్రమత్తం కావాలని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ వింత వ్యాధి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బయటపడింది. ఈ వ్యాధి కాంగో దేశాన్ని వణికిస్తోంది. గత 5 వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఈ వింత వ్యాధి సోకితే మొదట జ్వరంతో పాటు వాంతులు, అంతర్గత రక్తస్రావం వచ్చి చనిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే ఈ వ్యాధి ప్రధానంగా ఎబోలా, డెంగ్యూ, మార్ బర్గ్, యెల్లో ఫీవర్‌ను పోలి ఉండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఇటీవల బొలొకొ గ్రామంలో కొంతమంది పిల్లలు గబ్బిలాల మాంసం తినడంతో ఆ పిల్లలు 48 గంటల్లోనే చనిపోయారు. దీంతో దీని ద్వారానే ఈ వ్యాధి వ్యాపిస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వ్యాధి 400ల మందికి పైగా వ్యాపించగా.. ఇందులో 53 మంది చనిపోయారు.
ప్రస్తుతం ఈ వ్యాధి కాంగోలో చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుందని, వైరస్ సోకిన 48 గంటల్లో అనగా కేవలం రెండు రోజుల్లోనే మరణించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా కాంగో దేశంలో సరైన వైద్యం లేకపోవడంతో పాటు వ్యాధి వ్యాపించిన గ్రామాలు మారుమూల ప్రాంతాలు కావడంతో మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది.
ఈ వింత వ్యాధి సోకిన వ్యక్తిలో తలనొప్పి, బాడీ నొప్పులు, జ్వరం, చలి, దగ్గు, వాంతులు, మైయాల్జియా, చెమటలు రావడం, ముక్కు కారడం, మెడ దృఢత్వం, విరేచనాలు, కడుపు నొప్పితో పాటు అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు.