Last Updated:

Salt: ఉప్పుతో ముప్పు.. అమితంగా తినొద్దు..!

ఉప్పులేనిదే మనం ఏ వంటనూ వండలేము తినలేము. అలాంటి ఉప్పు కాస్త తక్కువైనా ఎక్కువైనా ఇబ్బందే. అయితే రోజూ మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా శరీరానికి అవసరమైన ఉప్పును అందిస్తాం. కొందరైతే ఉప్పు ఎక్కువగా వేసుకుని మరీ తింటుంటారు. ఇలా అదనంగా ఉప్పు తీసుకోవడమంటే ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Salt: ఉప్పుతో ముప్పు.. అమితంగా తినొద్దు..!

Salt: ఉప్పులేనిదే మనం ఏ వంటనూ వండలేము తినలేము. అలాంటి ఉప్పు కాస్త తక్కువైనా ఎక్కువైనా ఇబ్బందే. అయితే రోజూ మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా శరీరానికి అవసరమైన ఉప్పును అందిస్తాం. కొందరైతే ఉప్పు ఎక్కువగా వేసుకుని మరీ తింటుంటారు. ఇలా అదనంగా ఉప్పు తీసుకోవడమంటే ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచి కోసమో, సరిపోలేదనో ఆహార పదార్థాల్లో మరింత ఉప్పు వేసుకోవడం అనారోగ్యాలకు దారితీస్తుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మన ఆహారపు అలవాట్ల ప్రకారం రోజుకు సగటున 10 గ్రాముల ఉప్పు శరీరంలోకి చేరుతోందని అంచనా. అధిక రక్తపోటు భయంతో ఉప్పును తీసుకోవడం మరీ తగ్గించడమూ మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. మితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఉప్పులో ఉండే సోడియం మన శరీరంలోని ద్రవాలను సమతూకంగా ఉంచేందుకు తోడ్పడుతుందని వివరించారు. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలోకి ఎక్కువ మోతాదులో సోడియం చేరుతుందని, దానివల్ల రక్తనాళాల్లోకి ద్రవాలు ఎక్కువగా చేరతాయని ఫలితంగా రక్తపోటు పెరుగుతుందని అధిక మొత్తంలో తీసుకునే ఉప్పు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, మూత్రపిండాలు వ్యాధుల బారినపడే ప్రమాదాన్ని పెంచుతుంది వైద్యులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: శీతాకాలంలోని డస్ట్ అలర్టీకి ఇంటి చిట్కాలతో చెక్

ఇవి కూడా చదవండి: