Last Updated:

WHO: కరోనా మూలాలు తెలిస్తే చెప్పండి: డబ్ల్యూహెచ్ఓ

చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికించింది కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అక్కడక్కడ ఇంకా కేసులు ఉన్నా వైరస్ అదుపులోనే ఉంది.

WHO: కరోనా మూలాలు తెలిస్తే చెప్పండి: డబ్ల్యూహెచ్ఓ

WHO: చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికించింది కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అక్కడక్కడ ఇంకా కేసులు ఉన్నా వైరస్ అదుపులోనే ఉంది.

అసలు కరోనా చైనా సహజంగా పుట్టిందా? లేదా అమెరికా చెప్పినట్టు చైనా లోని వూహాన్ ల్యాబ్ లో వైరస్ ను సృష్టించారా అనేది విషయం ఇప్పటికీ నిర్ధారణ కాలేదు.

అయితే ఈ క్రమంలోనే కరోనా వైరస్ పుట్టుక మూలాలు గురించి తెలిసిన సమాచారాన్ని తెలపాలని అన్ని దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ( WHO)కోరింది.

కాగా, డబ్ల్యూహెచ్ఓ ఇలా కోరడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఏ ఒక్క అవకాశాన్నీవదిలేయదు(WHO)

‘ కరోనా (covid 19) మహమ్మారి మూలాల గురించి ఏ దేశం వద్ద ఎలాంటి సమాచారం ఉంటే.. దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ సైన్స్ సంస్థలకు వెల్లడించడం ఎంతో అవసరం.

దీనిని సేకరించేది ఏ ఒక్కరినో నిందించడానికి కాదు.

భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ముందస్తుగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగానే ఈ సమాచారాన్ని సేకరిస్తున్నాం.

కరోనా మూలాన్ని గుర్తించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ WHO వదిలేయదు’ అని ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్‌ అధనామ్ తెలిపారు.

ల్యాబ్‌ లీక్‌.. చైనా ఖండన

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ చైనా లో ఓ ల్యాబ్‌ నుంచే వ్యాప్తి జరిగిందని అమెరికా కు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది.

ఈ సంస్థ కొత్తగా సేకరించిన నిఘా సమాచారం మేరకు ల్యాబ్‌ లీక్‌పై ఓ నిర్ణయానికి వచ్చింది.

ది ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నత స్థాయి నిపుణులు ఉండటంతో ఈ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకొంది.

అమెరికాలో నేషనల్ ల్యాబ్స్ ను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంటుంది. అయితే ఈ నివేదికను చైనా తీవ్రంగా ఖండించింది. ఇది బీజింగ్ కు వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారంగా పేర్కొంది.