Pakistan : పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ ’కరెంట్ ‘ షాక్ .. ఎందుకో తెలుసా ?
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద ప్రతినిధులు పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చారు.కరెంట్ చార్జీలు యూనిట్‌కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు పరిమితం చేయాలని ఐఎంఎఫ్ షరతు విధించింది. కరెంట్ చార్జీలు యూనిట్‌కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు
Pakistan : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద ప్రతినిధులు పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చారు.
కరెంట్ చార్జీలు యూనిట్‌కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలని
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు
పరిమితం చేయాలని ఐఎంఎఫ్ షరతు విధించింది.
అప్పుడే అదనపు నిధులు ఇస్తామని తేల్చి చెప్పింది.
పాకిస్తాన్ సీడీఎంపీ ను తిరస్కరించిన ఐఎంఎఫ్ ..
పాక్ సమర్పించిన రివైజ్డ్ సర్క్యులర్ డెట్ మేనేజ్మెంట్ ప్లాన్ (సీడీఎంపీ)ను తిరస్కరించింది.
నాథన్ పోర్టర్ నేతృత్వంలోని ఐఎంఎఫ్ రివ్యూ మిషన్ ఇస్లామాబాద్‌లో పర్యటిస్తోంది.
7 బిలియన్ డాలర్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్)కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 9వ సమీక్షను పూర్తి చేయడానికి
పాకిస్తాన్ ఆర్థికమంత్రితో ఐఎంఎఫ్ చర్చలు జరుపుతోంది.
పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ షరతులు..
సవరించిన సీడీఎంపీ వాస్తవంగా లేదని, ఇది తప్పుడు అంచనాలతో రూపొందిందని ఐఎంఎఫ్ పేర్కొంది.
విద్యుత్ రంగ నష్టాలను నియంత్రించడానికి పాక్ ప్రభుత్వం తన పాలసీల్లో మార్పులు చేయాలని సూచించింది.
త్వరలో ప్రవేశపెట్టబోయే మినీ బడ్జెట్లో ఉన్న లోటును భర్తీ చేసేందుకు అదనపు పన్నులు వేయడంపై
ఐఎంఎఫ్, పాక్ రక్షణ శాఖతో కలిసి చర్చలు జరుపుతోంది. రివైజ్డ్ సీడీఎంపీ ప్రకారం..
సర్క్యులర్ డెట్‌ను 952 బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు పెంచాలని పాక్ ఐఎంఎఫ్‌ను కోరింది.
2023 మొదటి రెండు త్రైమాసికాల్లో విద్యుత్ టారిఫ్ సర్దుబాటు ద్వారా యూనిట్ టారిఫ్‌ను 7 రూపాయలకు పెంచామని,
జూన్ నుంచి మొదలయ్యే మూడో త్రైమాసికంలో 1.64 రూపాయలు పెంచుతామని,
తమకు 675 బిలియన్ల రూపాయల అదనపు సబ్సిడీ అవసరమని సీడీఎంపీలో వివరించింది.
అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీ అవసరాలను 675 బిలియన్ల రూపాయలకు
పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా లెక్కించిందనే దానిపైనా ఐఎంఎఫ్ ప్రశ్నలు సంధించింది.
అడుగంటిన పాకిస్తాన్ విదేశీ మారకద్రవ్యం నిల్వలు .. (Pakistan )
7 బిలియన్ డాలర్ల రుణం కోసం 9వ సమీక్ష కొనసాగుతోంది. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద
జనవరి 27వ తేదీ నాటికి విదేశీ మారకద్రవ్యం నిల్వలు 3.09 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి.
ఈ నిల్వలు కేవలం 18 రోజుల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి.
పాక్ ఆర్థికమంత్రిత్వశాఖ అధికారులతో ఐఎంఎఫ్ చీఫ్ నాథన్ కాస్తా మొండిగానే వ్యవహరించారని చెబుతున్నారు.
రెండు నుంచి రెండున్న లక్షల కోట్ల ద్రవ్యలోటును ఎలా లెక్కగట్టారని ఆయన ప్రశ్నించారు.
అయితే ఈ లోటును పూరించడానికి షరీఫ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.
వాటిలో ప్రధానంగా పెట్రోల్ ధరలు 16 శాతంపైనే పెంచేసింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర 30 శాతం పెంచింది.
ఎక్సేంజీ రేటుపై పరిమితి కూడా ఎత్తివేసింది. అయినా పరిస్థితులు మాత్రం చక్కబడలేదు.
ఇక దేశంలో ద్రవ్యోల్బణం 48 ఏళ్ల గరిష్ఠానికి ఎగబాకింది.
ప్రజలు కనీస అవసరాలైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
కుదేలయిన పాకిస్తాన్ ఆర్దిక వ్యవస్ద.. (Pakistan )
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులా తయారైంది.
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం తలెత్తింది. సుమారు వంద బిలియన్ డాలర్ల అప్పులు దేశంపైన ఉన్నాయి.
దేశంలో ఒక వైపు రాజకీయ సంక్షోభం మరో వైపు అదుపు తప్పుతున్న శాంతిభద్రతలు.
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి షెరీఫ్ ప్రభుత్వం ముప్పు తిప్పులు పడుతుంటే..
మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ మాత్రం వెంటనే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతులను గత్యంతరం లేక ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడిందని
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయని,
కాబట్టి ఐఎంఎఫ్ విధించే షరతులను ఆమోదించాల్సి పరిస్థితి ఏర్పడిందని
ఆయన ప్రజలకు వివరించి చెబుతున్నారు.
ఐఎంఎఫ్ తమపై దయ తలుస్తుందా లేదా అని పాకిస్తాన్ ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారు.
మరి ఐఎంఎఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో త్వరలో తేలిపోతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/