Last Updated:

Monkeypox: చైనాలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ విజృంభిస్తున్న సమయంలో ఆయా దేశాలు విదేశీ ప్రయాణికులకు పలు సూచనలు చేస్తున్నాయి. అయితే, విదేశీయులతో పాటు ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన వారి చర్మాన్ని తాకొద్దని తాజాగా చైనాలోని ఓ ఉన్నతాధికారి హెచ్చరించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

Monkeypox: చైనాలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు

China: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ విజృంభిస్తున్న సమయంలో ఆయా దేశాలు విదేశీ ప్రయాణికులకు పలు సూచనలు చేస్తున్నాయి. అయితే, విదేశీయులతో పాటు ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన వారి చర్మాన్ని తాకొద్దని తాజాగా చైనాలోని ఓ ఉన్నతాధికారి హెచ్చరించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆయన వ్యాఖ్యలు జాత్యాహంకార, వివక్షపూరితంగా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికీ కరోనా ఆంక్షలు కొనసాగుతున్న చైనాలో తాజాగా మంకీపాక్స్‌ తొలి కేసు నమోదైంది. విదేశాల నుంచి ఇక్కడి చాంగ్‌క్వింగ్‌ నగరానికి చేరుకున్న ఓ వ్యక్తి. కొవిడ్‌తో క్వారంటైన్‌లో ఉన్న సమయంలోనే మంకీపాక్స్‌ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే విదేశీయులతోపాటు గత మూడు వారాల్లో విదేశాల నుంచి వచ్చిన వారి చర్మాన్ని తాకొద్దని చైనా సీడీసీలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు వుజూన్‌యూ తమ దేశ పౌరులను హెచ్చరించారు. మంకీపాక్స్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కొత్త వ్యక్తులతోనూ స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్ట్‌ పెట్టుకొవద్దని హెచ్చరించారు. హోటళ్లు వంటి ప్రాంతాల్లో టాయిలెట్లను వినియోగించే సమయంలోనూ వాడిపారేసే టిష్యూలను ఉపయోగించాలని ఆయన సూచించినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

అయితే, చైనా అంటువ్యాధుల నిపుణుడు చేసిన ప్రకటన పై అక్కడి పౌరుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన వ్యాఖ్యలు జాత్యాహంకారంగా, వివక్షాపూరితంగా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. దేశంలో విదేశీయులు వివక్షను ఎదుర్కొంటున్న సమయంలో చైనా ప్రజలు మౌనంగా ఉండకూడదంటూ అక్కడి సామాజిక వేదికల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఇతరుల స్కిన్‌ కాంటాక్ట్‌ నుంచి తప్పించుకోలేమంటూ మరో సోషల్‌ మీడియా యూజర్‌ ఆయన ప్రకటనను తప్పుపట్టారు. మొత్తానికి చైనాకు కరోనా పాటు మంకీపాక్స్‌ పాటు జత కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీరో కోవిడ్‌ పాలసీతో ప్రభుత్వం ప్రజలను గృహం నిర్బంధంలో ఉంచడం. తాజాగా మంకీపాక్స్‌ కేసు వెలుగు చూడడటంతో వారి భయం మరింత పెరిగింది

ఇవి కూడా చదవండి: