Shadashtak Yog 2025: షడష్టక యోగ ప్రభావం.. జూన్ 7 వరకు ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు !

Shadashtak Yog In May 2025: జ్యోతిష్యశాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. రాహువు ఒక రాశిలో దాదాపు 18 నెలల పాటు ఉంటుంది. ఫలితంగా రాహువు ప్రభావం కూడా వ్యక్తులపై చాలా కాలం పాటు ఉంటుంది. అందుకే రాహువు రాశి మారినప్పుడల్లా అది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఇటీవల 18 మే 2025న, రాహువు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు.
రాహువు యొక్క ఈ రాశిచక్ర మార్పు సంవత్సరంలోని ప్రధాన సంచారాలలో ఒకటి. ఈ సమయంలో ఇది అంగారక గ్రహంతో సంయోగం కూడా ఏర్పరుస్తుంది. ఫలితంగా కొన్ని రాశుల వ్యక్తులకు సమస్యలను పెంచుతుంది. నిజానికి.. ఛాయా గ్రహం అయిన రాహువు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు అది కర్కాటక రాశిలో అంగారకుడి సమక్షంలో షడష్టక యోగాన్ని సృష్టిస్తోంది. ఈ యోగం మే 18 నుండి జూన్ 7 వరకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో 3 మూడు రాశుల వ్యక్తుల సమస్యలు పెరుగుతాయి. అందుకే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా..
వృషభ రాశి: మీరు పని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో.. మీరు విజయం సాధించడానికి కష్టపడి పనిచేయాలి . అంతే కాకుండా ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. వ్యాపారానికి సంబంధించి ఏ అడుగు వేసినప్పటికీ చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవలసిన అవసరం ఉంటుంది. అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వ్యాపారంలో పెద్ద అడ్డంకులు ఏర్పడతాయి. అంతే కాకుండా సంబంధాలు కూడా చెడిపోవచ్చు. కాబట్టి ఓపిక పట్టండి.
కర్కాటక రాశి: ఈ సమయంలో కొత్త పనులు చేయకుండా ఉండటం మంచిది. మీరు డబ్బు కొరతతో కూడా ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఆఫీసుల్లో సీనియర్లు, జూనియర్లతో వాదించడం మానుకోండి. కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి సమయం కేటాయించండి. పెట్టుబడి పెట్టే ముందు, ఖచ్చితంగా శ్రేయోభిలాషుల నుండి సలహా తీసుకోండి. అంతే కాకుండా మీ ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ వహించండి. వ్యాపారంలో కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ధనస్సు రాశి: బాధ్యతలు పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా కోపం, చిరాకు కూడా పెరుగుతాయి. మీరు ఒక నిర్దిష్ట పని కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. సంబంధాలను మెరుగుపరచుకోవడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. విద్యార్థులు చదువుపై ఆసక్తిని కోల్పోతారు. అంతే కాకుండా పెట్టుబడుల్లో కూడా నష్టాలు ఎదురవుతాయి. అంతే కాకుండా మీ సమస్యలు పెరిగే అవకాశాలు కూడా చాలానే ఉంటాయి.