Published On:

Trump: గోల్డెన్ డోమ్ పరిచయం చేసిన ట్రంప్.. మూడేళ్లలో అందుబాటులోకి

Trump: గోల్డెన్ డోమ్ పరిచయం చేసిన ట్రంప్.. మూడేళ్లలో అందుబాటులోకి

USA: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థకు సంబంధించిన గోల్డెన్ డోమ్ వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిచయం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అత్యాధునిక మిస్సైళ్ ఢిపెన్స్ సిస్టమ్ ను దేశ ప్రజలకు అందించబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థ కోసం అధికారికంగా ఆర్కిటెక్చర్ ను ఎంచుకున్నట్టు ప్రకటించడానికి సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.

 

గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థతో బాలిస్టిక్, క్రూయజ్ మిస్సైళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని.. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి వైమానిక దాడులనైనా తిప్పికొట్టగలదని పేర్కొన్నారు. అందుకోసం 175 బిలియన్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తన పదవీకాలం ముగిసేలోపు ఈ రక్షణ వ్యవస్థ అందుబాటులోకి రానుందన్నారు. గోల్డెన్ డోమ్ భూమి, అంతరిక్ష క్షిపణి వ్యవస్థ. ఇది మిస్సైళ్లలను పలు దశల్లో ఉన్నప్పుడే గుర్తించి, ట్రాక్ చేసి నాశనం చేస్తుంది. ఈ వ్యవస్థ అమెరికా రక్షణ రంగానికి చాలా ముఖ్యమైందన్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్.. రక్షణ వ్యవస్థను ఉపయోగించుకుంటోంది. అందులో నుంచి వచ్చేందే గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ.

 

మరోవైపు గోల్డెన్ డోమ్ డిజైన్ ఇప్పటికే ఉన్న భూ- ఆధారిత రక్షణ సామర్థ్యాలతో లింక్ చేయబడుతుందని పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ చెప్పారు. క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్ సోనిక్ మిస్సైళ్లు, డ్రోన్స్, అణు దాడుల నుంచి గోల్డెన్ డోమ్ రక్షిస్తుందన్నారు. కాగా గోల్డెన్ డోమ్ పూర్తయ్యేందుకు మూడేళ్లు సమయం పడుతుందన్నారు. మూడేళ్ల తర్వాత వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. ప్రాజెక్టుకు యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్టీన్ నాయకత్వం వహిస్తారు. కాగా యూఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థపై రష్యా, చైనా ఆందోళన వ్యక్తం చేశాయి.